The train
-
రైలు ఢీకొని యువకుడు..
పెనుకొండ: పట్టణంలోని దర్గాపేటకు చెందిన ముఫాసిర్ (25) రైలు ఢీకొని ఆదివారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు, బంధువుల కథనం మేరకు.. కొన్ని నెలలుగా ముఫాసిర్ మతి స్థిమితం సరిగా లేక ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఆదివారం రాత్రి మార్కెట్‌యార్డ్ సమీపంలో రైలు ఢీకొని మృత్యువాతపడ్డాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న తల్లిదండ్రులు నసీమున్నీసా, హుజూర్ అహ్మద్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఏతల్లి.. కన్నబిడ్డో!
ఘట్కేసర్: రైలులో ఓ మగశిశువు లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం ఘట్కేసర్లో వెలుగుచూసింది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కాచిగూడ నుంచి తెనాలి-కాచిగూడ ప్యాసింజర్ తెనాలికి బయలుదేరింది. 11 గంటల సమయంలో ఓ బోగీలోని బాత్రూమ్ సమీపంలో సంచిలోంచి శిశువు రోదనలు వినిపించాయి. రైలు చర్లపల్లి దాటిన తర్వాత ప్రయాణికులు గమనించారు. సంచిలో చూడగా దుస్తువులో చుట్టి ఓ మగశిశువు ఉన్నాడు. అప్పటికే రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు రైలు చైన్ లాగి స్టేషన్ మాస్టర్‌కు విషయం తెలిపారు. స్టేషన్‌మాస్టర్ సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. శిశువును వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పసికందు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. శిశువు జన్మించి దాదాపు 15 రోజులు అవుతుండొచ్చని డాక్టర్లు పేర్కొన్నారు. అనంతరం 108 సిబ్బంది ఈఎమ్‌టీ నాగరాజ్, పెలైట్ బద్రూలు పసికందును తీసుకెళ్లి యూసుఫ్‌గూలోని శిశువిహార్‌లో పసికందును అప్పగించారు. ఏతల్లి కన్న బిడ్డో.. ఇలా కర్కషంగా పడేసి వెళ్లారని ప్రయాణికులు శాపనార్థాలు పెట్టారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా శిశువును రైలులో వదిలేసి వెళ్లిపోయారని స్థానికులు చెప్పారు. -
బోగీలను వదిలి,.. రైలు పరుగు
బెంగళూరు: మైసూరు, బెంగళూరుకు మధ్య ప్రయాణిస్తున్న రైలులో ఇంజిన్‌నుంచి కొన్ని బోగీలు వేరుపడి కొద్ది సేపు రైలు పరుగులు పెట్టింది. శనివారం ఉదయం ఏడున్నరకు 13 బోగీలతో దర్బాంగ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఎనిమిదిన్నరకు మండ్య సమీపంలో తొమ్మిదో బోగీ బేరింగ్ విరగడంతో ఆ బోగీ విడిపోయింది. కొద్దిసేపటికి మరో నాలుగు బోగీలు విడిపోయి, మొత్తం అయిదు బోగీలకు రైలుతో లింక్ పోయింది. చాలా సేపటికి పరిస్థితిని గమనించిన డ్రైవర్, రైలును తిరిగి మండ్యకు మళ్లించారు. తొమ్మిదో బోగీ మినహా మిగిలిన బోగీలను రైలుకు తగిలించాక రైలు బెంగళూరు బయలుదేరింది. -
చిన్నారుల మరణం బాధాకరం
కొవ్వొత్తులతో నివాళులర్పించిన విద్యార్థులు శ్రీకాకుళం కల్చరల్: స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘట నలో అసువులు బాసిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని పట్టణానికి చెందిన చిన్నారులు ప్రార్థించారు. కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద ఠాగూర్ పబ్లిక్ స్కూల్, చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్, హెల్పింగ్ హేండ్స్, హిందీ మంచ్, యంగ్ ఇండియా, ఏపీటీఎఫ్ సభ్యులు కలసి సామూహికంగా శుక్రవారం సాయంత్రం నివాళులు అర్పించా రు. ఈ సందర్భంగా ఏడు రోడ్ల కూడలి వద్ద చిన్నారులంతా.. కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి..చిన్నారుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ సం దర్భంగా శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ..గేట్లు లేని క్రాసింగ్‌ల వద్ద వెం టనే గేట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాల న్నారు. స్కూల్ యాజమాన్యాలు సైతం బస్సు ల నిర్వహణ, డ్రైవర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదంలో 16 మంది చిన్నారులు చనిపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ బెహరా శ్రీదేవి, కరస్పాండెంట్ రవికుమార్, జేసీస్ సెనెటర్ నటుకుల మోహన్, చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్ సభ్యులు ఎల్.నందికేశ్వరరావు, జామి భీమశంకరరావు, బరాటం కామేశ్వరరావు, యంగ్ ఇండియా ప్రెసిడెంట్ మందపల్లి రామకృష్ణ, హిందీమంచ్ అధ్యక్షుడు ఏపీటీఎఫ్ నాయకుడు సదాశివుని శంకరరావు, నిక్కు హరిసత్యనారాయణ, గుమ్మా నాగరాజు, వెంకటేశ్వరరావు, కోన్శైర్ తదితరులు పాల్గొన్నారు.