ప్రసాదం తిని 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పెనుగొండ: ప్రసాదం తిని 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుగొండ మండలం శెట్టిపల్లి తండాలో జరిగింది. ఆదివారం ఓ ఆలయంలో భక్త సమాజం వారు పెసరగారెలు, పానకాన్ని పంచిపెట్టారు. ప్రసాదాలను తిన్న వెంటనే విరేచనాలు, వాంతులు మొదలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు స్తానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఎంతకీ తగ్గకపోవడంతో 40 మంది బాధితులు చికిత్స కోసం సోమవారం ఉదయం పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. కలుషితమైన ఆహారం తినడం వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు తెలిపారు.