‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. ఇంజనీరింగ్‌కు రూ. 5లక్షల ఫీజు కట్టాల్సివస్తుంది. ఎల్‌కేజీకి కూడా లక్ష కట్టాల్సి వస్తుంది. ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా ఉండదు. ఇప్పటికే 6వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవాలంటే రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. పించన్లు, రేషన్ కార్డులు తీసేస్తారు. ఆరోగ్య శ్రీ అటకెక్కుతుంది.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.