కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్
పెనుకొండ : శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలను ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సొల మన్ ఆరోగ్యరాజ్ తెలిపారు. శనివారం ఉత్సవాల ఏర్పాట్లపై అనంతపురం జిల్లా పెనుకొండలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో పలు ప్రాంతాలు పరి శీలించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని పరి శీలించి దానికి రంగు వేయాలని ఆర్డీఓ వెంకటేశుకు సూచిం చారు. ఉత్సవాలకు వచ్చేవారు ఉండేం దుకు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వేదిక ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
స్టాల్స్ ఏర్పాటు, రాయల కాలం నాటి వివిద యుద్ధ పోటీల విన్యాసాలు, కళాకృతుల ప్రదర్శన వంటి వాటిపై చర్చించారు. అనంతరం పెనుకొండ కొండపైకి చేరుకుని అక్కడ సమావేశం నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్నదానం, తాగు నీరు సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇతర ముఖ్యుల రాక, వారికి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో ఏజేసీ రామస్వామి, డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, సిరికల్చర్ జేడి అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉత్సవాలను విజయవంతం చేద్దాం
ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి శ్రీకృష్ణ దేవరాయలు ఉత్సవాలను విజయవంతం చే యాలని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని భవన విజయం సమావేశపు భవనంలో ఆయన జిల్లా, మండల, డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలు ఉత్సవాల నిర్వహణకు 16 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. కమిటీలో నిర్దేశించిన మేరకు ఆయా అధికారులు తమ భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ప్రస్తుతం ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.32 లక్షల నిధులు విడుదల చేసిందని తెలిపారు. మరిన్ని నిధులు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
27, 28 తేదీల్లో రాయల ఉత్సవాలు
Published Sun, Aug 17 2014 2:38 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement
Advertisement