war competition stunts
-
ఆ ‘వైరస్’ తో నిమిషానికి 11 మంది మృతి
వెబ్డెస్క్: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా. అయితే కరోనాను మించిన మరో మహమ్మారి చాప కింద నీరులా భూమ్మీద దేశాలను పట్టి పీడిస్తోంది. కరోనాను మించిన మరణాలు ఈ మహమ్మారి కాటుకు గురవుతున్నాయి. కరోనాను మించిన ఆ భయంకర వైరస్ పేరు ఆకలి. అవును ఆక్స్ ఫాం అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలు ఆకలి చావులు పెరిగినట్టు తేలింది. ఆకలిరాజ్యం పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ ఆకలి వైరస్ ఎక్కువైంది పేరిట విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ నివేదిక ప్రకారం ఈ భూమ్మిదీ నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారని తేలింది. కరోనాను మించి ఇవ్వాళ ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలితో 11 మంది ఊపిరి వదులుతున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది చిక్కుకున్నారని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2 కోట్ల మంది ఎక్కువగా ఆకలి బారిన పడ్డారని తెలిపింది. సైనిక సంక్షోభం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. వీరికి తినడానికి బుక్కెడు బువ్వ దొరకట్లేదు. ఆకలి వారి ప్రాణాలను తోడేస్తోంది. రోజూ వందలాది మందిని కబళిస్తోంది. మరోవైపు కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద ప్రాంతాలకు అందుతోన్న సాయం కూడా తగ్గుతోంది. సైన్యంపైనే ఖర్చు కరోనా, లాక్ డౌన్ లతో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి యుద్ధ వాతావరణం తోడు కావడంతో సుమారు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది. చాలా దేశాలు కరోనా ఉన్నా యుద్ద పరిస్థితుల కారణంగా తమ ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ బలగాల పటిష్ఠత కోసం ఖర్చు చేయక తప్పలేదని వెల్లడించింది. ఈ ఖర్చు రూ. 5,100 కోట్ల డాలర్లు దాటిందని.... పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఇది ఆరు రెట్లు ఎక్కువని తేల్చి చెప్పింది. అంతర్ యుద్దాలతో ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి అంతర్ యుద్దాల్లో చిక్కుకున్న దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాబిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని సూత్రీకరించింది. ఈ దశాబ్దంలోనే ధరల పెరుగుదలలో ఇదే అత్యధికమని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా నిరుపేదలు ఆకలి రాజ్యంలోకి నెట్టివేయబడుతున్నారని పేర్కొంది. -
27, 28 తేదీల్లో రాయల ఉత్సవాలు
కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ పెనుకొండ : శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలను ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సొల మన్ ఆరోగ్యరాజ్ తెలిపారు. శనివారం ఉత్సవాల ఏర్పాట్లపై అనంతపురం జిల్లా పెనుకొండలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో పలు ప్రాంతాలు పరి శీలించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని పరి శీలించి దానికి రంగు వేయాలని ఆర్డీఓ వెంకటేశుకు సూచిం చారు. ఉత్సవాలకు వచ్చేవారు ఉండేం దుకు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వేదిక ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. స్టాల్స్ ఏర్పాటు, రాయల కాలం నాటి వివిద యుద్ధ పోటీల విన్యాసాలు, కళాకృతుల ప్రదర్శన వంటి వాటిపై చర్చించారు. అనంతరం పెనుకొండ కొండపైకి చేరుకుని అక్కడ సమావేశం నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్నదానం, తాగు నీరు సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇతర ముఖ్యుల రాక, వారికి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో ఏజేసీ రామస్వామి, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, సిరికల్చర్ జేడి అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేద్దాం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి శ్రీకృష్ణ దేవరాయలు ఉత్సవాలను విజయవంతం చే యాలని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని భవన విజయం సమావేశపు భవనంలో ఆయన జిల్లా, మండల, డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలు ఉత్సవాల నిర్వహణకు 16 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. కమిటీలో నిర్దేశించిన మేరకు ఆయా అధికారులు తమ భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ప్రస్తుతం ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.32 లక్షల నిధులు విడుదల చేసిందని తెలిపారు. మరిన్ని నిధులు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.