జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితి నేపథ్యంలో జిల్లా రైతుల రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ డిమాండ్ చేశారు.
జిల్లా రైతుల రుణాలను మాఫీ చేయాలి
Published Mon, Dec 5 2016 10:45 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
పెనుకొండ : జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితి నేపథ్యంలో జిల్లా రైతుల రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈయేడు తీవ్ర వర్షాభావంతో జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో తీవ్రమైన తాగునీటి సమస్య నెలకొననుందన్నారు. ఇప్పటికే వేలాది కుటుంబాలు వలసలు వెళ్లాయని ఇంకా అనేక కుటుంబాలు అదే బాటలో ఉన్నాయన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ వెంటనే వేరుశనగ పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 20 వేల పరిహారం, రైతుల రుణాలను మొత్తం మాఫీ చేయాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు, రోజుకు రూ. 300 కూలీ వేతనం అందించాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని పార్టీలతో కలసి చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతామన్నారు. 2014-15 సంవత్సరం పంట నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు శ్రీరాములు, జనార్దన్‌రెడ్డి, క్రిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement