పరిగి(పెనుకొండ రూరల్):
పరిగి మండలం కొడిగేపల్లికి చెందిన శ్యామల(28) మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. మూడు నెలల కిందట జరిగిన స్టౌ ప్రమాదంలో ఆమె గాయపడగా 108లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అప్పట్లో బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోగా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. హిందూపురం ఆస్పత్రి వైద్యులు ఆందించిన రిపోర్టు ఆధారంగా పోలీసులు గురువారం గ్రామానికి వెళ్లి విచారించారు.శ్యామల మృతి చెందినట్లు తెలుసుకున్న పోలీసులు తహశీల్దార్ సుబ్బారెడ్డికి సమాచారం అందించారు. ఆయన సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆ తరువాత పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు.