అనంతపురం అగ్రికల్చర్ : పెనుకొండ మండలంలో గురువారం సాయంత్రం 25 మి.మీ వర్షం కురిసింది. కొత్తచెరువు 22 మి.మీ, రాయదుర్గం 20 మి.మీ, డి.హిరేహాల్, ధర్మవరం 15 మి.మీ, శెట్టూరు 10 మి.మీతో పాటు విడపనకల్, కనేకల్లు, బొమ్మనహాల్, పరిగి, చెన్నేకొత్తపల్లి, పుట్టపర్తి, బత్తలపల్లి, ముదిగుబ్బ, తనకల్లు, కుందుర్పి, తాడిమర్రి తదితర మండలాల్లో చిరు జల్లులు పడ్డాయి. రాయదుర్గం మండలంలో ఈదురుగాలులకు పల్లేపల్లి, 74–ఊడేగోళం ప్రాంతాల్లో 10 కరెంటు స్తంభాలు నేలవాలాయి. బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతిచెందాయి.