subjail
-
కుర్చీ కొనిస్తేనే జైలు నుంచి విడుదల?
పెనుకొండ: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించడం లేదన్నట్లుగా ఉంది పెనుకొండ సబ్‌జైలు అధికారుల తీరు. రిమాండ్ ఖైదీలకు కోర్టు బెయిల్ ఇచ్చినా... విడుదలకు మాత్రం సబ్‌జైలు అధికారులు భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఒకే ఊరికి చెందిన కొందరు రిమాండ్ ఖైదీలను విడుదల చేసేందుకు రూ.8 వేల విలువైన కుర్చీ డిమాండ్ చేశారు. దీంతో వారి బంధువులు కుర్చీ కొని సబ్‌జైలు వద్ద సిబ్బందికి ఇవ్వగా, వారు తీసుకువెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొత్తచెరువు మండలానికి చెందిన కొందరిని నెల రోజుల క్రితం పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి వారికి రిమాండ్ విధించడంతో పెనుకొండ సబ్‌జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం వారికి బెయిల్ లభించగా, ఆ పత్రాలను తీసుకుని ఖైదీల బంధువులు సబ్‌జైలుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది సబ్‌జైలుకు రూ.8 వేల విలువైన కుర్చీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రిమాండ్ ఖైదీల బంధువులు ఆ కుర్చీ కొనుగోలు చేసి సబ్ జైలుకు తీసుకువచ్చి అందజేశారు. -
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు దగ్గర ఉద్రిక్తత
-
విద్యతోనే ఖైదీల్లో సత్ప్రవర్తన
పరిగి: ఖైదీలు ప్రతిఒక్కరూ చదువుకోవాలని ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. శుక్రవారం రాత్రి ఆమె పరిగి సబ్‌జైల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఆమె మాట్లాడారు. జైలులో అందుతున్న సదుపాయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ఖైదీలకు పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఖైదీలు ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదువుకుంటేనే సమాజంలో ఏది మంచో.. ఏది చెడో తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. చదువు మనకు విజ్ఞానాన్ని అందజేస్తుందన్నారు. చదువుతోనే మనం నాగరికులుగా మారగలమని వివరించారు. ఈ భూ ప్రపంచంలో మిగతా ప్రాణుల మనిషిని ఉన్నతస్థాయిలో నిలిపింది చదువేనని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనిషి విద్యావంతుడైనప్పుడు ఆత్మగౌరవం పెరుగుతుందని ఆమె వివరించారు. జైలులో ఉన్న ప్రతిఖైదీ చదువుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. ఇక్కడ నేర్చుకున్న చదువును తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశ్ఫక్, ఎస్ఐ కృష్ణ, జైలు సూపరింటెండెంట్ తిర్మల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెరగని ముద్ర..
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం : జిల్లాలో ఏడు సబ్‌జైళ్లు ఉండగా, జిల్లా కేంద్రం కాకినాడలోని సబ్‌జైలును స్పెషల్ సబ్‌జైలుగా ఆధునికీకరించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఖైదీలకు ఆధునాతన వసతులు కల్పిస్తున్నారు. ఖైదీల మనస్సులు నిర్మలంగా ఉండేలా వారితో యోగా చేయిస్తున్నారు. అంతేకాదు ఓంశాంతి వారి శాంతిసందేశాలను అందిస్తున్నారు. న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించి ఖైదీలు సత్ప్రవర్తన కలిగేలా వారికి వివిధ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. లీగల్ క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఖైదీల కోసం స్పెషల్ సబ్‌జైలులో మినరల్ వాటర్, రైస్ కుక్కర్లు, డైనింగ్ టేబుళ్లు, గార్డెన్, çషవర్‌బాత్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సబ్‌జైలు ఆవరణ పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. అలాగే ఖైదీల కోసం వచ్చే బంధు, మిత్రులు కూర్చోవడానికి షెల్టర్, తాగడానికి మంచినీరు కల్పించారు. లోపలికి వెళితే ఇదొక జైలులా కాకుండా ఆశ్రమానికి తలపించేలా తీర్చిదిద్దారు. సువిశాలమైన గదులు, గదులన్నింటిలో ఫ్యాన్లు అమర్చారు. ఆటవిడుపుగా కేరమ్స్, చెస్, చదువుకోవడానికి పుస్తకాలు, చూడడానికి టీవీ సౌకర్యాలను కల్పించారు. ఖైదీలను ఎమర్జెన్సీగా ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించారు. సబ్‌జైలులో ఉండే ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో వారానికి రెండుసార్లు మాట్లాడే అవకాశాన్ని జైల్ అధికారులు కల్పించారు. ఖైదీల ఆరోగ్యం సబ్ జైలులో ప్రత్యేకంగా ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేశారు. మెనూలో మార్పులు ఉదయం టిఫిన్, వారంలో రెండు రోజులు చపాతి, అందులో బంగాళదుంప కూర, మరో రెండు రోజులు గోధుమనూక, వరినూక ఉప్మా, రెండు రోజులు పులిహోర, ఒక రోజు పొంగలి పెడుతున్నారు. నెలలో మొదటి ఆదివారం మధ్యాహ్నం మేక మాంసం, రెండు, మూడు, నాలుగు వారాలు కోడిమాంసం, మంగళవారం కోడిగుడ్డు ఇస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రెండేసి రోజులు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పుతో పాటు ఆకు కూర పెడుతున్నారు. సాయంత్రం కాయగూరల భోజనం పెడుతున్నారు. సీసీ కెమెరాల నిఘా ఖైదీల కదలికలు, వారి మానసిక పరిస్థితిని నిరంతరం పరిశీలించేందుకు సబ్‌జైలులో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వారి సత్ప్రవర్తనను కూడా తెలుసుకుంటున్నారు. ‘‘జైళ్లు సంస్కరణాలయాలుగా ఉండాలి. ఖైదీల్లో మార్పు తీసుకువచ్చి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి’’ ఇదీ మహాత్ముడి ఆశయం. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు జైళ్ల అధికారులు. ‘‘సెంట్రల్ జైలైనా.. సబ్ జైలైనా.. ఒక్కసారి అందులోకి వెళితే నరకం అనుభవించాల్సిందే..’’ అనే ఒకప్పటి మాటను కూడా జైలు అధికారులు మరచిపోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం చెరసాలలను అధునాతన మార్పులతో ఖైదీల్లో పరివర్తన తెచ్చే శాలలుగా మార్చేస్తున్నారు. తమదైన శైలిలో ‘చెర’గని ముద్ర వేస్తున్నారు. -
సబ్ జైలులో ఖైదీ ఆత్మహత్య
నల్గొండ: మిర్యాలగూడ సబ్ జైలులో విచారణా ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గూడూరు మండలం బండపెరికతండాకు చెందిన అజ్మీర వెంకటేశ్వర్లు(34) సబ్ జైలులో విచారణా ఖైదీగా ఉన్నాడు. సొంత అన్నను చంపిన కేసులో బెయిల్ వచ్చినా బయటకు వెళ్లకుండా జైలులోనే ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న వెంకటేశ్వర్లు సోమవారం అర్ధరాత్రి సమయంలో బాత్రూంకు వెళ్లి యాసిడ్ తాగాడు. ఈ విషయాన్ని గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్ధితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు.