చంటిపిల్లలతో ఏదైనా పనిచేయించాలంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకువస్తుంటుంది. అదొక పెద్ద టాస్క్‌లా మారిపోతుంది. చిన్నపిల్లలకు హెయిర్ కటింగ్ చేయించాలన్నా, ఇంజక్షన్ చేయించాలన్నా, ఫొటో తీయాలన్నా అది పెద్దలకు శక్తికి మించిన పనిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏడుపునకు దిగితే ఇక తల్లిదండ్రుల తల పట్టుకోవాల్సిందే. అయితే ఇటువంటి సమయంలో ఒక తండ్రి అనుసరించిన పద్దతి ఎంతో చక్కగా ఉన్నదంటూ, అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ఒక తండ్రి తన కుమార్తెకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయించాలనుకున్నాడు. అయితే అతని కుమార్తె ఫొటోకు అనుగుణంగా కుర్చీలో కూర్చొనేందుకు సహకరించ లేదు. ఆ చిన్నారి కుర్చీలో కూర్చుంటేనే ఫొటో తీయగలనని ఫొటోగ్రాఫర్ అన్నాడు. దీనికి అతని తండ్రి సమాధానమిస్తూ తన కుమార్తె తన చంకలో నుంచి దిగడం లేదని, కుర్చీలో కూర్చొనేందుకు సహకరించడం లేదని తెలిపాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని? ఫొటోగ్రాఫర్ అడగగా, నా దగ్గర ఒక ఐడియా ఉందని తండ్రి సమాధానమిచ్చాడు.
కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రికి వచ్చిన ఐడియా ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తన కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రి కుర్చీలో కూర్చుని, తనపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆ చిన్నారికి ఫొటో తీశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.
ఈ ఫొటో చూసిన యూజర్స్ తండ్రి అనుసరించిన టెక్నిక్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ‘మీ అమ్మాయి ఎంతో ముద్దొస్తోంది. మీరు ఎంతో తెలివైనవారు’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘నా కుమారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఇలానే తీయాల్సి వచ్చిందని’ పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..!
Passport worker - We're gonna need the baby to sit on the chair for the photo.
— Yair Menchel (@yairmenchel) July 20, 2023
Dad - She won't let me put her down.
Passport worker - You're gonna need to figure something out if you want a passport picture.
Dad - I got an idea... pic.twitter.com/cx9sm5EsBl
Comments
Please login to add a commentAdd a comment