
పశ్చిమగోదావరి: మరి కొద్దిసేపట్లో తాళి కట్టాల్సిన పెళ్లి కుమారుడు పరారయ్యారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చింతలపుడి మండలం యర్రగుంట పల్లి గ్రామానికి చెందిన ఎర్రమాల రాజేష్‌కు తాళ్లపుడి మండలం తిరుగురు మెట్టకు చెందిన మాధవితో పెళ్లి నిశ్చయమైంది. ఈ రోజు పెళ్లి తంతు నిర్వహించడానికి వధువు తరుపు బంధువులంతా కలిసి వరుడి గ్రామానికి చేరుకున్నారు.
పెళ్లి మండపంలో గండల తరబడి ఎదురుచూసినా పెళ్లికొడుకు అక్కడికి రాలేదు. ఏం జరిగిందోనని వధువు బంధువులు అతని ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. చుట్టు పక్కల వారిని ఆరాదీయగా వరుడు పరారయ్యారని తెలిసింది. కాగా.. పెళ్లికి ముందు మాట్లాడుకున్న పది లక్షల కట్నంలో ఇప్పటికే రూ. 5 లక్షలు ఇచ్చామని వధువు తల్లిదండ్రులు చెప్పారు.