
వెంకటేశ్వర్లు మృతదేహం
సాక్షి, అన్నపురెడ్డిపల్లి: పోలీసుల నుంచి తప్పించుకోబోయి పరుగెత్తి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కొండాయిగూడెం గ్రామ శివారులో ఆదివారం కోడి పందేలు నిర్వహించారు. స్థానిక పోలీసులు కోడి పందేల స్థావరం దగ్గరకు వెళ్తుండగా.. పందేలకు పాల్పడుతున్నవారు గమనించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తారు. వారిలో ఎర్రగుంట కే కాలనీకి చెందిన మళ్లా వెంకటేశ్వర్లు(55) కూడా ఉన్నాడు. ఆయన పరిగెడుతూ గ్రామ సమీపంలోని జామాయిల్ తోటలో కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీరాముల శ్రీనును వివరణ కోరగా.. అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment