కిన్షాసా: కాంగో రాజధాని కిన్షాసాలోని సెంట్రల్ మకాలా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 129 మంది మృతి చెందారు. వారిలో 24 మంది కాల్పుల్లో చనిపోయినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ మంగళవారం తెలిపారు. ‘‘తప్పించుకునేందుకు జైలుకు ఖైదీలు నిప్పు పెట్టారు. జైలు భవనం, ఫుడ్ డిపోలు, ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఊపిరాడక చాలామంది చనిపోయారు.
ఈ గందరగోళం మధ్యే పలువురు మహిళా ఖైదీలు అత్యాచారానికి కూడా గురయ్యారు’’ అని వివరించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిలో పలువురిని పోలీసులు హతమార్చినట్టు సమాచారం. మకాలా జైలు సామర్థ్యం 1,500 మాత్రమే. కానీ అధికారిక లెక్కల ప్రకారమే 15,000 మంది ఖైదీలున్నారు. వీరిలో ఎక్కువ విచారణ ఖైదీలేనని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment