drc
-
జైలు నుంచి తప్పించుకుంటూ... 129 మంది ఖైదీలు మృతి
కిన్షాసా: కాంగో రాజధాని కిన్షాసాలోని సెంట్రల్ మకాలా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 129 మంది మృతి చెందారు. వారిలో 24 మంది కాల్పుల్లో చనిపోయినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ మంగళవారం తెలిపారు. ‘‘తప్పించుకునేందుకు జైలుకు ఖైదీలు నిప్పు పెట్టారు. జైలు భవనం, ఫుడ్ డిపోలు, ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఊపిరాడక చాలామంది చనిపోయారు.ఈ గందరగోళం మధ్యే పలువురు మహిళా ఖైదీలు అత్యాచారానికి కూడా గురయ్యారు’’ అని వివరించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిలో పలువురిని పోలీసులు హతమార్చినట్టు సమాచారం. మకాలా జైలు సామర్థ్యం 1,500 మాత్రమే. కానీ అధికారిక లెక్కల ప్రకారమే 15,000 మంది ఖైదీలున్నారు. వీరిలో ఎక్కువ విచారణ ఖైదీలేనని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. -
డీఆర్సీ.. ఏమైనట్టు..?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్షేమాభివృద్ధి పథకాల అమలును సమీక్షించే నాథులే లేకపోవడం.. వివిధ శాఖల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం.. అధికారుల్లో సమన్వయం కొరవడటంతో జిల్లా ప్రగతి తిరోగమిస్తోంది. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు కావస్తోన్నా ఇప్పటికీ జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించిన దాఖలాలు లేకపోవడమే అందుకు తార్కాణం. జిల్లా ప్రగతికి దిశానిర్దేశం చేసే డీఆర్సీలను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం.. ఇన్చార్జ్ మంత్రిని నియమించకపోవడం సంక్షేమాభివృద్ధి పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలుచేయడం, సమస్యలను పరిష్కరించడం, అధికారులను సమన్వయం చేయడం కోసం జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం రివాజు. డీఆర్సీ చైర్మన్ హోదాలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రతి మూణ్ణెళ్లకు ఒకసారి సమావేశాలు నిర్వహించి.. అధికారులకు దిశానిర్దేశం చేస్తే ప్రగతిపథంలో దూసుకెళ్లవచ్చునన్నది ప్రభుత్వ భావన. 1995-2004 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ.. 2004-2014 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు డీఆర్సీలను ఏర్పాటు చేయడమే అందుకు తార్కాణం. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఐదు నెలలు పూర్తికావస్తోన్నా ఇప్పటికీ డీఆర్సీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదు. కనీసం జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిని కూడా నియమించలేదు. ఏసీడీపీ(అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం) కింద శాసనసభ స్థానానికి ఏడాది రూ.కోటి కేటాయిస్తారు. ఇందులో రూ.50 లక్షల విలువైన పనులను ఎమ్మెల్యే, రూ.50 లక్షల విలువైన పనులను ఇన్చార్జ్ మంత్రి ప్రతిపాదిస్తారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో నియోజకవర్గానికి ఆర్పీహెచ్ పథకం కింద ఏటా కేటాయించే 1000 ఇళ్లల్లో 500 గృహాలకు ఎమ్మెల్యే, తక్కిన 500 ఇళ్లకు ఇన్చార్జ్ మంత్రి లబ్ధిదారులను ఎంపి చేసేవారు. కానీ ఇప్పటికీ ఏసీడీపీ, ఆర్పీహెచ్ల కింద నిధులను మంజూరు చేయలేదు. ఇన్చార్జ్ మంత్రి డీఆర్సీకి ఛైర్మన్‌గానూ.. కలెక్టర్ సభ్య కార్యదర్శిగానూ వ్యవహరిస్తారు. డీఆర్సీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే డీఆర్సీ సమావేశాలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతోపాటూ వివిధ శాఖల ఉన్నతాధిరులు అందరూ విధిగా హాజరుకావాలి. ఈ సమావేశాల్లో సంక్షేమాభివృద్ధి పథకాల అమలును సమీక్షించి.. అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. మినీ అసెంబ్లీగా పరిగణించే డీఆర్సీ సమావేశాలు వివిధ శాఖల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుని.. ప్రభుత్వం ఆమోదముద్ర వేసేలా చూస్తుంది. ఇది సంక్షేమాభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసేది. కానీ ఇప్పుడు డీఆర్సీ సమావేశాలు నిర్వహించకపోవడంతో సంక్షేమాభివృద్ధి పథకాలను సమీక్షించలేని దుస్థితి నెలకొంది. అధికారుల మధ్య సమన్వయంలోపించడంతో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి.పరిపాలన అస్తవ్యస్తంగా మారడం, సంక్షేమాభివృద్ధి పథకాల అమలు పడకేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి ఎద్దడిని నివారించడంలోనూ.. ఉపాధిహామీ పథకాన్ని చేపట్టి వలసలను నిరోధించడంలోనూ, గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులను చెల్లించడంలోనూ అధికారులు విఫలమవుతోండటమే అందుకు నిలువెత్తు నిదర్శనం. -
ఇక ప్రగతి పథమే
- ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా వెనక్కి పోనివ్వం - సీమాంధ్ర ఉద్యోగులు బుద్ధి మార్చు కోవాలి - డీఆర్సీ ఇక రెండు రోజులు - వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు : ‘‘జిల్లాలో, రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి. ఇక మిగి లింది అభివృద్ధి ఒక్కటే. పార్టీలు, సిద్ధాంతాలు పక్కన బెట్టి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేద్దామని వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శని వారం కొత్తగా కొలువుదీరిన జడ్పీ పాలక వర్గం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుద్దేశించి ఆయన మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చిన దఫేదార్ రాజును జడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేసింది సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. ఇందుకు సీఎంకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. స్వాతంత్య్రం రావడానికి గాంధీజీ ఎలాంటి శాంతి ఉద్యమం చేశారో కేసీఆర్ కూడా అలాంటి ఉద్యమమే చేసి తెలంగాణను సాధించారన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా వెనక్కిపోనివ్వమన్నారు. జడ్పీ పాలకవర్గం ప్రజా సమస్యలపై జిల్లా అభివృద్ధిపై సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించకుండా పూర్తి కోరంతో హాజరు కావాలని సూచించారు. డీఆర్సీ సమావేశాన్ని ఒక్కరోజుకే పరిమితం కాకుండా సంక్షేమ రంగం ఒకరోజు, అభివృద్ధిపై ఒకరోజు మొత్తం రెండు రోజులు సమీక్ష నిర్వహిస్తామని, ఇదే మాదిరిగా జడ్పీ సమావేశం కూడా నిర్వహిస్తామని సమావేశంలో తీర్మానం చేశారు. డీఆర్సీ సమావేశం ఈనెల 18,19 తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన సీమాంధ్ర ప్రిన్సిపాల్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రకటనలు ఇస్తూ భయపెడుతున్నాడని ఆయన బుద్ధిమార్చుకోకుంటే తామే మా ర్చుతామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు ఇకనైన బుద్ధి మార్చుకోవాలన్నా రు. జిల్లాలో 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలి సిందని, ఇందులో ఒక్కపైసా కూడా దుబారాకావడానికి వీలులేదన్నారు. ఈ విషయంపై మండల అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు. మహిళలకు అవకాశం మహిళకు అవకా శం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వైస్ చైర్‌పర్సన్‌గా ధర్పల్లి జడ్పీటీసీ సభ్యులు సుమనారెడ్డిని ఎన్నుకున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. మిగితా జడ్పీటీసీ సభ్యులు నిరాశకు లోనుకావద్దన్నారు. చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్ కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మినీ అసెంబ్లీలాగా జడ్పీ సర్వసమావేశంలో ప్రతి అంశం చర్చకు తీసుకురావాలన్నారు. వర్షాలు లేక రైతు ల్లో, ప్రజల్లో భయం, ఆందోళన నెలకొందని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దని వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన పరిశ్రమలను జిల్లా లో స్థాపించే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రజ ల కోసం పార్టీలకతీతం గా పనిచేసేందుకు ప్రజాప్రతినిధులందరు కలిసి రావాలని కోరా రు. అభివృద్ధిపై దృష్టిపెట్టండి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై ప్రజాప్రతిని ధులు దృష్టిపెట్టాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. అభివృ ద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. జుక్కల్‌ను అభివృద్ధిలో ముందుంచాలి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం వెనుకబడి ఉందని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అన్నారు. అందుకే అక్కడి నుంచి జడ్పీ చైర్మన్‌గా దఫేదార్రాజును ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కవితను అగ్గిపుల్లగా వర్ణించారు. నిజాంసాగర్ జిల్లాకు గుండెకాయ జుక్కల్ ప్రాంతం నుంచి జడ్పీ చైర్మన్‌గా రాజు ఎన్నిక కావడం చాల సం తోషంగా ఉందని ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్నారు. జిల్లాకు గుండెకాయ అయిన నిజాంసాగర్ ప్రాజెక్టును మరింత అధునీకరించాలన్నారు. జిల్లాలో అగ్నిగుండంలా ఉద్యమం నిజామాబాద్ జిల్లాలో ఉద్యమం రాజుకుంటే అగ్నిగుండంలా మారుతుందని కేసీఆర్ ఎప్పుడూ అంటుండేవారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆ ఉద్యమమే నేడు జడ్పీపై పార్టీ జెండా ఎగురవేసిందన్నారు. మాడల్ జిల్లాగా తీర్చిదిద్దుదాం రానున్న కాలంలో జిల్లాను మరింత అభివృద్ధి చేద్దామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. రెండు రోజులు నిర్వహిద్దాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఇక ముందు రెండు రోజుల పాటు నిర్వహిద్దామని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో కులకషంగా ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను, 24 మంది జడ్పీటీసీలను టీఆర్ఎస్ నుంచి గెలిపించారని ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయవద్దని అన్నారు. కొత్త దనం రావాలి.... కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తదనం ఉండాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్న ప్రభుత్వం వాటి అమలుకు ప్రజాప్రతినిధులు , అధికారులపై బాధ్యత పెట్టిందన్నారు. గౌరవమైన జిల్లా పరిషత్ వేదిక ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. మొక్కుబడి సమావేశాలు వద్దు.. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించకూడదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సభ్యులందరు పూర్తిగా హాజరై ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరించాలన్నారు. జడ్పీకి ఇద్దరు యువసారథులు వచ్చారని వారి హయంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించలన్నారు. అభివృద్ధి జుక్కల్తోనే ప్రారంభం అవ్వాలి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్‌ను ఎంపిక చేసుకొని ఇక్కడినుంచే అభివృద్ధి పనులు ప్రారంభించనుందని హన్మం త్ సింధే తెలిపారు. ఈ ఒక ప్రాంతంమే కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్దికి కూడా కృషి చేస్తామని తెలిపారు. అందరి సహకారంతో అభివృద్ధికి పాటుపడుతాం జిల్లా పరిషత్ చైర్మన్‌గా తనను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతున్నట్లు జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, వైస్‌చైర్మన్ సుమనరెడ్డి అన్నారు. మంత్రి, ఎంపీలతో పాటు అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఏం మంత్రులో..ఏంటో!
ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామంటూ ప్రతిన చేసిన మన ప్రజాప్రతినిధులు.. ఆ ప్రజలనే మరచిపోయిన కాలం దాపురించింది. అధికారానికి దూరంగా ఉన్న నేతలు ప్రజల తరఫున నిలబడి పోరాడడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. అధికార అందలాలను అధిరోహించి.. అమాత్యులై కూడా పాలనను గాలికొదిలి.. ప్రజలను పట్టించుకోవడం లేదంటే ఏమనుకోవాలి?! జిల్లా సమస్యల పరిష్కారానికి ప్రధాన వేదిక అయిన డీఆర్సీ గురించి కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ.. వారితో కుమ్మక్కు రాజకీయాలు నెరపుతున్న తెలుగుదేశీయులకు కానీ ఏమీ పట్టడంలేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా తూర్పు గోదావరి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మన జిల్లా నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అధికార పార్టీ వారి సంఖ్యే అధికం. కాకినాడ, అరకు ఎంపీలు ఎంఎం పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్‌లు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఇక్కడి ప్రజల గురించి కానీ, ఈ జిల్లా అభివృద్ధి గురించి కానీ.. ఇందులో కీలక భూమిక పోషించే జిల్లా అభివృద్ధి కమిటీ (డీఆర్సీ) సమావేశం గురించి కానీ వీరిలో పట్టించుకున్నవారే లేరు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండే డీఆర్సీ సమావేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన మూడు నెలలకోసారి జరపాలి. అలా జరిగితే ఆ సమయంలో వచ్చే ప్రధాన సమస్యలపై చర్చించి, పరిష్కరించే వీలుంటుంది. గత మార్చి తొమ్మిదో తేదీన అప్పటి హోం, జిల్లా ఇన్చార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. తరువాత తొమ్మిది నెలలుగా దీని ఊసే లేదు. చిత్రమేమిటంటే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన తరువాత ఇంతవరకూ ఇన్చార్జి మంత్రి నియామకమే జరగలేదు. ఇటువంటి సర్కార్ తమ సమస్యలను ఏం పరిష్కరిస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డీఆర్సీ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, జాతీయ ఉపాధి హామీ, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, నీటిపారుదల తదితర పలు శాఖల పని తీరును సమీక్షించి, అవసరమైన చర్యలు చేపట్టాలి. ఈ సమావేశం జరగకపోవడంతో ఆయా శాఖల పనితీరును పట్టించుకుంటున్నవారే లేరు. మాట్లాడని మంత్రులు తన అధ్యక్షతన జరిగే విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశానికి వచ్చి వెళ్లడమే తప్ప కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు డీఆర్సీ గురించి పట్టించుకోవడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు జిల్లాలో అడుగుపెట్టే ధైర్యం చేయని ఆయన.. ఉద్యమం చల్లబడ్డ తరువాత జిల్లాకు వచ్చారు. రాష్ట్ర మంత్రి తోట నరసింహం కూడా డీఆర్సీ ఊసెత్తిన దాఖలాలే లేవు. తరచూ వివిధ కార్యక్రమాల పేరుతో హడావుడే తప్ప జిల్లా అభివృద్ధి గురించి కానీ, అసలు జిల్లాలో ఏం జరుగుతోందన్న అంశాన్ని కానీ ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీఆర్సీపై మంత్రులిద్దరూ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా డీఆర్సీలో జాప్యం జరిగిందని నేతలు సమర్థించుకునే యత్నం చేస్తున్నారని, అయితే ఈ ఉద్యమం వచ్చి మూడు నెలలే అయిందని, దానికి ముందు ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్యలున్నా.. స్పందనే లేదు పై-లీన్ తుపాను, ఆ తరువాత వచ్చిపడ్డ భారీ వర్షాలతో జిల్లాలో రైతులు, మత్స్యకార, చేనేత కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం ఇటువంటి సమయంలోనైనా బాధితులకు చేయూతనిచ్చే దిశగా డీఆర్సీ ఏర్పాటు చేసి ఉండాల్సిందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, జిల్లాలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాన్ని ఆశించి డెల్టా ఆధునికీకరణ, డ్రెయిన్లలో ముంపు సమస్య పరిష్కారంవంటి వాటి కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సుమారు రూ.1600 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులపై డీఆర్సీలో చర్చించే అవకాశం ఉన్నా స్పందించేవారే లేరు. -
ఐదు నెలలు దాటినా ఊసులేని డీఆర్సీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) ప్రతి మూడు నెలలకోమారు క్రమం తప్పకుండా సమీక్షించాల్సి ఉంటుంది. జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం జిల్లా పాలనా యంత్రాంగానికి ఓ రకంగా దిశా నిర్దేశం చేస్తుంది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా డీకే అరుణ బాధ్యతలు స్వీకరించి ఆగస్టుకు ఏడాది పూర్తయింది. 2012 సెప్టెంబర్ 27న, 2013 మార్చి 30న రెండు పర్యాయాలు మాత్రమే డీఆర్సీ సమావేశం నిర్వహించారు. సమావేశం ఏర్పాటు చేసిన ప్రతీసారి ప్రతి మూడు నెలలకోమారు సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్తున్నా, ఆచరణ కు మాత్రం నోచుకోవడం లేదు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనితీరును సమీక్షించాల్సిన ‘విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ’ సమావేశం నిర్వహణ ఊసు ఏడాది దాటినా వినిపించడం లేదు. మెదక్ ఎంపీ విజయశాంతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం కూడా ప్రతీ మూడు నెలలకోమారు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలై 14న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని డీఆర్డీఏ ప్రతిపాదించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సమావేశం నిర్వహణ వాయిదా పడింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సమావేశం నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. మంత్రులదీ అదే దారి డిప్యూటీ సీఎం సహా జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కేబినెట్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరెవరూ కలెక్టరేట్ ముఖం చూసిన పాపాన పోవడం లేదు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి శాఖల వారీగా సమీక్షించేందుకు తీరిక చిక్కడం లేదు. దీంతో కీలక శాఖల పనితీరుపై సమీక్ష కొరవడి పాలన కుంటుపడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా, మండల పరిషత్, మున్సిపాలిటీలకు పాలక మండలి లేకపోవడంతో ప్రత్యేక అధికారులతో కాలం నెట్టుకొస్తున్నారు. అధికారుల పనితీరుపై సమీక్షించే నాథుడే లేడు. విస్తారంగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం అంచనాలకు మించి పెరిగింది. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కుతున్నా పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి కనిపించడం లేదు. రేషన్, పించన్లు కోసం అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించే వారే కరువయ్యారు. సంక్షేమ విభాగాలు, ఇంజనీరింగ్ శాఖల పనితీరుపై సమీక్ష లేక నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.