ఇక ప్రగతి పథమే | all are elections ended in state, district | Sakshi
Sakshi News home page

ఇక ప్రగతి పథమే

Published Sun, Jul 6 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

ఇక ప్రగతి పథమే

ఇక ప్రగతి పథమే

 - ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా వెనక్కి పోనివ్వం
 - సీమాంధ్ర ఉద్యోగులు బుద్ధి మార్చు కోవాలి
 - డీఆర్‌సీ ఇక రెండు రోజులు
 - వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

 ఇందూరు :  ‘‘జిల్లాలో, రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి. ఇక మిగి లింది అభివృద్ధి ఒక్కటే. పార్టీలు, సిద్ధాంతాలు పక్కన బెట్టి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేద్దామని వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శని వారం కొత్తగా కొలువుదీరిన జడ్పీ పాలక వర్గం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుద్దేశించి ఆయన మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చిన దఫేదార్ రాజును జడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేసింది సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు.

ఇందుకు సీఎంకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. స్వాతంత్య్రం రావడానికి గాంధీజీ ఎలాంటి శాంతి ఉద్యమం చేశారో కేసీఆర్ కూడా అలాంటి ఉద్యమమే చేసి  తెలంగాణను సాధించారన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా వెనక్కిపోనివ్వమన్నారు. జడ్పీ పాలకవర్గం ప్రజా సమస్యలపై జిల్లా అభివృద్ధిపై సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించకుండా పూర్తి కోరంతో హాజరు కావాలని సూచించారు. డీఆర్‌సీ సమావేశాన్ని ఒక్కరోజుకే పరిమితం కాకుండా సంక్షేమ రంగం ఒకరోజు, అభివృద్ధిపై ఒకరోజు మొత్తం రెండు రోజులు సమీక్ష  నిర్వహిస్తామని, ఇదే మాదిరిగా జడ్పీ సమావేశం  కూడా  నిర్వహిస్తామని సమావేశంలో తీర్మానం చేశారు.

డీఆర్‌సీ సమావేశం ఈనెల 18,19 తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన సీమాంధ్ర ప్రిన్సిపాల్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తానంటూ  ప్రకటనలు ఇస్తూ భయపెడుతున్నాడని ఆయన బుద్ధిమార్చుకోకుంటే తామే మా ర్చుతామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు ఇకనైన బుద్ధి మార్చుకోవాలన్నా రు.  జిల్లాలో 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలి సిందని, ఇందులో ఒక్కపైసా కూడా దుబారాకావడానికి వీలులేదన్నారు. ఈ విషయంపై మండల అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జడ్‌పీ సీఈఓను ఆదేశించారు.
 
మహిళలకు అవకాశం
మహిళకు అవకా శం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వైస్ చైర్‌పర్సన్‌గా ధర్పల్లి జడ్పీటీసీ సభ్యులు సుమనారెడ్డిని ఎన్నుకున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. మిగితా జడ్‌పీటీసీ సభ్యులు నిరాశకు లోనుకావద్దన్నారు. చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్ కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మినీ అసెంబ్లీలాగా జడ్‌పీ సర్వసమావేశంలో ప్రతి అంశం చర్చకు తీసుకురావాలన్నారు. వర్షాలు లేక రైతు ల్లో, ప్రజల్లో భయం, ఆందోళన నెలకొందని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దని వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన పరిశ్రమలను జిల్లా లో స్థాపించే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రజ ల కోసం పార్టీలకతీతం గా  పనిచేసేందుకు ప్రజాప్రతినిధులందరు కలిసి రావాలని కోరా రు.
 
అభివృద్ధిపై దృష్టిపెట్టండి
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై ప్రజాప్రతిని ధులు దృష్టిపెట్టాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. అభివృ ద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు.
 
జుక్కల్‌ను అభివృద్ధిలో ముందుంచాలి
జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం వెనుకబడి ఉందని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అన్నారు. అందుకే అక్కడి నుంచి జడ్పీ చైర్మన్‌గా దఫేదార్‌రాజును ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కవితను అగ్గిపుల్లగా వర్ణించారు.
 
నిజాంసాగర్ జిల్లాకు గుండెకాయ

జుక్కల్ ప్రాంతం నుంచి జడ్‌పీ చైర్మన్‌గా రాజు ఎన్నిక కావడం చాల సం తోషంగా ఉందని ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్నారు. జిల్లాకు గుండెకాయ అయిన నిజాంసాగర్ ప్రాజెక్టును మరింత అధునీకరించాలన్నారు.
 
జిల్లాలో అగ్నిగుండంలా ఉద్యమం
నిజామాబాద్ జిల్లాలో ఉద్యమం రాజుకుంటే అగ్నిగుండంలా మారుతుందని కేసీఆర్  ఎప్పుడూ అంటుండేవారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆ ఉద్యమమే నేడు జడ్‌పీపై పార్టీ జెండా ఎగురవేసిందన్నారు.
 
మాడల్ జిల్లాగా తీర్చిదిద్దుదాం
రానున్న  కాలంలో జిల్లాను మరింత అభివృద్ధి చేద్దామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు.
 
రెండు రోజులు నిర్వహిద్దాం

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని  ఇక ముందు రెండు రోజుల పాటు నిర్వహిద్దామని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు.  ఈ సమావేశంలో కులకషంగా ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను, 24 మంది జడ్పీటీసీలను టీఆర్‌ఎస్ నుంచి గెలిపించారని ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయవద్దని అన్నారు.
 
కొత్త దనం రావాలి....

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో  కొత్తదనం ఉండాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్న ప్రభుత్వం వాటి అమలుకు ప్రజాప్రతినిధులు , అధికారులపై బాధ్యత పెట్టిందన్నారు.  గౌరవమైన జిల్లా పరిషత్ వేదిక ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.
 
మొక్కుబడి సమావేశాలు వద్దు..
కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించకూడదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సభ్యులందరు పూర్తిగా హాజరై ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరించాలన్నారు. జడ్పీకి ఇద్దరు యువసారథులు వచ్చారని వారి హయంలో జిల్లాను  అభివృద్ధి పథంలో నడిపించలన్నారు.
 
అభివృద్ధి జుక్కల్‌తోనే ప్రారంభం  అవ్వాలి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్‌ను ఎంపిక చేసుకొని ఇక్కడినుంచే అభివృద్ధి  పనులు ప్రారంభించనుందని హన్మం త్ సింధే తెలిపారు. ఈ  ఒక ప్రాంతంమే కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్దికి కూడా కృషి చేస్తామని తెలిపారు.
 
అందరి సహకారంతో అభివృద్ధికి పాటుపడుతాం
జిల్లా పరిషత్ చైర్మన్‌గా తనను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతున్నట్లు జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, వైస్‌చైర్మన్ సుమనరెడ్డి  అన్నారు. మంత్రి,  ఎంపీలతో పాటు  అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement