the Chairman
-
టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీ
-
టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీ
ఫైల్ సిద్ధం చేసిన ఎండోమెంట్ విభాగం తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి ఆశిస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసేలా రంగం సిద్ధం చేసింది. శాసనసభ సమావేశాల పేరుతో ట్రస్టు బోర్డు ఏర్పాటును మరింత జాప్యం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు టీటీడీలో ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీ సమావేశాల పేరుతో..: టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అన్న కనుమూరి బాపిరాజు నేతృత్వంలోని కమిటీని ఈనెల 9వ తేదిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తో రద్దు చేసింది. కేంద్ర కేబినెట్ హోదాతో సమానంగా పరిగణించే టీటీడీ చైర్మన్ పదవికి తొలి నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రస్తుత బోర్డును రద్దు చేశాక కీలక పదవిని ఆశించేవారి జాబితా చాంతాడంత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాష్ర్ట శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 18వ తేది నుంచి సెప్టెంబర్ 12వ తేది వరకు జరగనున్నాయి. ఇంతలోపే హడావిడిగా కొత్త ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తే పదవుల పందేరంలో సమస్యలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు యోచన చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో ట్రస్టు బోర్డు ఏర్పాటు మరింత జాప్యం చేయాలని భావిస్తున్నారు. ఇంతలోపు టీటీడీలో పరిపాలన పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే సంబంధిత శాఖాధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీనిపై రాష్ట్ర ఎండోమెంట్ మంత్రి వద్ద ఫైల్ సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. కొత్త స్పెసిఫైడ్ అథారిటీకి సంబంధించి మరో రెండు మూడురోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. స్పెసిఫైడ్ అథారిటీపై టీటీడీ ఉన్నతాధికారుల్లో చర్చ జోరందుకుంది. -
ఇక ప్రగతి పథమే
- ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా వెనక్కి పోనివ్వం - సీమాంధ్ర ఉద్యోగులు బుద్ధి మార్చు కోవాలి - డీఆర్సీ ఇక రెండు రోజులు - వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు : ‘‘జిల్లాలో, రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి. ఇక మిగి లింది అభివృద్ధి ఒక్కటే. పార్టీలు, సిద్ధాంతాలు పక్కన బెట్టి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేద్దామని వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శని వారం కొత్తగా కొలువుదీరిన జడ్పీ పాలక వర్గం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుద్దేశించి ఆయన మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చిన దఫేదార్ రాజును జడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేసింది సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. ఇందుకు సీఎంకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. స్వాతంత్య్రం రావడానికి గాంధీజీ ఎలాంటి శాంతి ఉద్యమం చేశారో కేసీఆర్ కూడా అలాంటి ఉద్యమమే చేసి తెలంగాణను సాధించారన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా వెనక్కిపోనివ్వమన్నారు. జడ్పీ పాలకవర్గం ప్రజా సమస్యలపై జిల్లా అభివృద్ధిపై సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించకుండా పూర్తి కోరంతో హాజరు కావాలని సూచించారు. డీఆర్సీ సమావేశాన్ని ఒక్కరోజుకే పరిమితం కాకుండా సంక్షేమ రంగం ఒకరోజు, అభివృద్ధిపై ఒకరోజు మొత్తం రెండు రోజులు సమీక్ష నిర్వహిస్తామని, ఇదే మాదిరిగా జడ్పీ సమావేశం కూడా నిర్వహిస్తామని సమావేశంలో తీర్మానం చేశారు. డీఆర్సీ సమావేశం ఈనెల 18,19 తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన సీమాంధ్ర ప్రిన్సిపాల్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రకటనలు ఇస్తూ భయపెడుతున్నాడని ఆయన బుద్ధిమార్చుకోకుంటే తామే మా ర్చుతామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు ఇకనైన బుద్ధి మార్చుకోవాలన్నా రు. జిల్లాలో 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలి సిందని, ఇందులో ఒక్కపైసా కూడా దుబారాకావడానికి వీలులేదన్నారు. ఈ విషయంపై మండల అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు. మహిళలకు అవకాశం మహిళకు అవకా శం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వైస్ చైర్‌పర్సన్‌గా ధర్పల్లి జడ్పీటీసీ సభ్యులు సుమనారెడ్డిని ఎన్నుకున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. మిగితా జడ్పీటీసీ సభ్యులు నిరాశకు లోనుకావద్దన్నారు. చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్ కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మినీ అసెంబ్లీలాగా జడ్పీ సర్వసమావేశంలో ప్రతి అంశం చర్చకు తీసుకురావాలన్నారు. వర్షాలు లేక రైతు ల్లో, ప్రజల్లో భయం, ఆందోళన నెలకొందని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దని వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన పరిశ్రమలను జిల్లా లో స్థాపించే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రజ ల కోసం పార్టీలకతీతం గా పనిచేసేందుకు ప్రజాప్రతినిధులందరు కలిసి రావాలని కోరా రు. అభివృద్ధిపై దృష్టిపెట్టండి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై ప్రజాప్రతిని ధులు దృష్టిపెట్టాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. అభివృ ద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. జుక్కల్‌ను అభివృద్ధిలో ముందుంచాలి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం వెనుకబడి ఉందని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అన్నారు. అందుకే అక్కడి నుంచి జడ్పీ చైర్మన్‌గా దఫేదార్రాజును ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కవితను అగ్గిపుల్లగా వర్ణించారు. నిజాంసాగర్ జిల్లాకు గుండెకాయ జుక్కల్ ప్రాంతం నుంచి జడ్పీ చైర్మన్‌గా రాజు ఎన్నిక కావడం చాల సం తోషంగా ఉందని ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్నారు. జిల్లాకు గుండెకాయ అయిన నిజాంసాగర్ ప్రాజెక్టును మరింత అధునీకరించాలన్నారు. జిల్లాలో అగ్నిగుండంలా ఉద్యమం నిజామాబాద్ జిల్లాలో ఉద్యమం రాజుకుంటే అగ్నిగుండంలా మారుతుందని కేసీఆర్ ఎప్పుడూ అంటుండేవారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆ ఉద్యమమే నేడు జడ్పీపై పార్టీ జెండా ఎగురవేసిందన్నారు. మాడల్ జిల్లాగా తీర్చిదిద్దుదాం రానున్న కాలంలో జిల్లాను మరింత అభివృద్ధి చేద్దామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. రెండు రోజులు నిర్వహిద్దాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఇక ముందు రెండు రోజుల పాటు నిర్వహిద్దామని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో కులకషంగా ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను, 24 మంది జడ్పీటీసీలను టీఆర్ఎస్ నుంచి గెలిపించారని ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయవద్దని అన్నారు. కొత్త దనం రావాలి.... కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తదనం ఉండాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్న ప్రభుత్వం వాటి అమలుకు ప్రజాప్రతినిధులు , అధికారులపై బాధ్యత పెట్టిందన్నారు. గౌరవమైన జిల్లా పరిషత్ వేదిక ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. మొక్కుబడి సమావేశాలు వద్దు.. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించకూడదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సభ్యులందరు పూర్తిగా హాజరై ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరించాలన్నారు. జడ్పీకి ఇద్దరు యువసారథులు వచ్చారని వారి హయంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించలన్నారు. అభివృద్ధి జుక్కల్తోనే ప్రారంభం అవ్వాలి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్‌ను ఎంపిక చేసుకొని ఇక్కడినుంచే అభివృద్ధి పనులు ప్రారంభించనుందని హన్మం త్ సింధే తెలిపారు. ఈ ఒక ప్రాంతంమే కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్దికి కూడా కృషి చేస్తామని తెలిపారు. అందరి సహకారంతో అభివృద్ధికి పాటుపడుతాం జిల్లా పరిషత్ చైర్మన్‌గా తనను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతున్నట్లు జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, వైస్‌చైర్మన్ సుమనరెడ్డి అన్నారు. మంత్రి, ఎంపీలతో పాటు అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా వెల్లడించారు. -
పుర పీఠం కోసం రె‘ఢీ’
సాక్షి, ఖమ్మం : పుర పాలక వర్గం కొలువుదీరేందుకు అంతా సిద్ధమైంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు మున్సిపాలిటీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక చైర్మన్ ‘పీఠ’ముడి ఉన్న మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. స్పష్టమైన మెజారిటీ రాని చోట చైర్మన్ పీఠానికి పోటీ పెరిగి రాజకీయం వేడెక్కింది. క్యాంపు రాజకీయంతో పుర పాలి‘టిక్స్’ జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం మూడు నెలల తర్వాత పుర చైర్మన్లు కొలువుదీరబోతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటి నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల ఎప్పుడు జరుగుతాయోనని వేచిచూడసాగారు. అయితే సార్వత్రిక ఎన్నికలు, నూతన ప్రభుత్వ ఏర్పాటుతో ఇంతకాలం వాయిదా పడిన ఈ ఎన్నికలకు ఎట్టకేలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గురువారం ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల నామినేషన్.. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన వారు వెంటనే ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం మున్సిపాలిటీకి ఆర్డీఓ అమయ్‌కుమార్, ఇల్లెందుకు పాల్వంచ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మధిరకు ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డి, సత్తుపల్లికి భద్రాచలం మొబైల్ కోర్టు జడ్జి వెంకటాచారి ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులయ్యారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ మున్సిపాలిటీల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొత్తగూడెం, మధిరలో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. క్యాంపు రాజకీయాలు తారుమారైతే ఎమ్మెల్యేల ఓటుతో గట్టెక్కిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. ఇటు క్యాంపు రాజకీయంతో పాటు తమ ఓటు కూడా కీలకం కావడంతో స్థానిక ఎమ్మెల్యేలు పుర పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. ‘అవుటాఫ్’లో క్యాంపులు.. స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీల్లో చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు క్యాంపు రాజకీయం జోరందుకుంది. పీఠంపై ఎవరికి కూర్చోబెట్టాలనే విషయంలో స్థానికంగా ఉండే ప్రధాన నేతలతో ఎమ్మెల్యేలు మంతనాలు చేస్తున్నారు. క్యాంపులు కూడా వీరి పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఇల్లెందుకు చెందిన కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంపులో ఉన్నారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపులోనే చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే మధిరలో కాంగ్రెస్.. టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంది. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ కూటమిగా పోటీ చేశాయి. అయితే ఇప్పుడు టీడీపీతో కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్‌తో పాటు సీపీఐకి చెందిన కొందరు కౌన్సిలర్లు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కాగా, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తమ పార్టీ కౌన్సిలర్లు ‘చే’జారకుండా హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి చైర్మన్ పీఠంపై ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు కన్నేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీరిని జిల్లా సరిహద్దులో క్యాంపునకు తరలించి సయోధ్య కుదిర్చే యత్నంలో మునిగారు. ఇక కొత్తగూడెంలో రాజకీయం రసకందాయంలో పడింది. అన్ని పార్టీల కౌన్సిలర్లు పట్టణంలోనే ఉండి ఎవరు తమకు ప్యాకేజీ ఎక్కువ ఇస్తే వారి వైపే మొగ్గు చూపాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. విప్ జారీ చేసినా ఇప్పట్లో అనర్హత వేటు ఉండదని, ఆలోపు పదవి కాలం పూర్తవుతుందనే భరోసాతో కొందరు కౌన్సిలర్లు తాయిలాలకు సై అంటున్నట్లు సమాచారం. కాగా, మున్సిపల్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ఎమవుతుందో కొద్ది గంటల్లో తేలనుంది. నాలుగేళ్లకు మున్సిపల్ పాలకవర్గం.. గత ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదు. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు నూతన పాలక వర్గాలు కొలువుదీరుతున్నాయి. 2010 సెప్టెంబర్ 29న గత పాలక వర్గం పదవి కాలం పూర్తయింది. ఆ వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం పట్టించుకునే వారు లేకోపవడంతో మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. అధికారులే ప్రత్యేక అధికారులుగా ఉండి పాలనను కొనసాగించారు. దీంతో ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏళ్లుగా పైపులైన్లకు లీకేజీలకు మరమ్మతులు లేకపోవడంతో కాలుషిత నీటిని తాగి పుర ప్రజలు రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు నూతనంగా పాలన పగ్గాలు చేపడుతున్న వారికి ఈ సమస్యలన్నీ తీర్చడం పెద్ద సవాలే. వచ్చిన నిధులన్నీ సకాలంలో ఖర్చు చేయక నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నూతన పాలకవర్గం ఈ సమస్యలన్నింటిపై దృష్టి పెడితేనే కొంతమేరైనా పుర ప్రజల సమస్యలు తీరనున్నాయి. -
ప్రజాపాలనకు సన్నాహాలు
సాక్షి, కర్నూలు: కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో త్వరలో పురపాలక, జిల్లా, మండల పరిషత్తుల పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనే ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు కూడా వెలువడినా ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వం విషయంలో నెలకొన్న సందిగ్ధంతో ప్రమాణ స్వీకారాలు జరగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడంతో స్థానిక పురపాలక, జిల్లా, మండల పరిషత్తులకు ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దీనికి సానుకూలంగా ఉండటంతో త్వరలోనే వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదా పు రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది. పరిషత్తులకూ: పురపాలక పాలకమండళ్ల ప్రమాణస్వీకార ప్రక్రియ ముగిసిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 53 మండలాల్లో 30 జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించింది. మండల పరిషత్ అధ్యక్ష పీఠాలూ ఎక్కువగానే వైఎస్సార్సీపీ ఖాతాలో చేరనున్నాయి. పురపాలికల్లో: జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, బనగానపల్లె పురపాలక సంఘానికి తప్ప మిగిలిన నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలు ఉండగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం కోసం ఎదురుచూస్తున్నారు. పాలకమండళ్లు ఏర్పడ్డాక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఆయా ఖజానాలకు జమ కానుండగా, ఇదే సమయంలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది. త్వరితగతిన కౌన్సిల్ ఏర్పడితే కేంద్రనిధులు, స్థానిక బడ్జెట్ నిధులతో తమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీరంతా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. మరోపక్క కౌన్సిల్లో కీలకమైన ఎక్స్అఫిషియో సభ్యత్వంపై చర్చ సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే సంబంధిత పురపాలక సం ఘంలో ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్య వహరిస్తారు. ఎంపీలు కూడా వారి ని యోజకవర్గాల పరిధిలో తమకు నచ్చిన పురపాలికలో సభ్యత్వాన్ని పొందవచ్చు. చైర్మన్ ఎంపిక క్లిష్టతరమైనప్పుడు వీరి ఓటు కీలకమవుతుంది. మార్గదర్శకాలు ఇలా: = రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక తేదీకి సంబంధించి ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. = వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు గెజిటెడ్ హోదా గల అధికారి ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు. =ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హజరుకావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యులలో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేనిపక్షంలో ఎన్నిక వాయిదా పడుతుంది. =తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీచేసే అధికారం ఉంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల్లో ఎవరిని బలపరచాలనే అంశంపై విప్ జారీ చేస్తాయి. విప్లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు. = తర్వాత ఎన్నిక ప్రక్రియ చేతులు ఎత్తే పద్ధతిలో జరుగుతుంది. ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఏ సభ్యుడైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటును చెల్లుబాటుగానే పరిగణిస్తారు. తర్వాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా సభ్యుని పదవి రద్దు విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ సభ్యుడు పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. -
చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులపైనే దృష్టి
పావులు కదుపుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సదాశివపేట, న్యూస్‌లైన్: మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దృష్టిసారించాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు తమకే వస్తాయని రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. టీఆర్ఎస్కు చైర్మన్ వైస్ చైర్మన్ స్ధానాలు దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఏది ఏమైనా చెర్మైన్, వైస్ చెర్మైన్ పదవులు తమవేనని ఆ రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ రెండు వరకు ఆగాల్సిందే! మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈనెల 12 ప్రకటించినా చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక మాత్రం జరిగే అవకాశాలు లేవని చేప్పవచ్చు. వీరి ఎంపిక జూన్ రెండో తేదీ తరువాతనే చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఏ ముహుర్తాన నిర్వహించారోగాని అడుగడుగునా ఉత్కంఠ తప్పడం లేదు. ఎన్నికలైన తరువాత ఫలితాలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. ఫలితాలు ఎప్పుడెప్పుడాఅని అభ్యర్థులు కళ్లల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. ఫలితాలు విడుదలైతే మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల పదవుల ఎన్నిక ఎప్పుడో అనే సందేహం తలెత్తుతోంది. ఈ పదవుల ఎన్నికపై ఎన్నికల కమిషన్ ఇంత వరకు అధికారిక ప్రకటన చేయలేదు. జూన్ 2న అపాయింటెడ్ డే ఉన్నందువల్ల ైచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో అయోమయం నెలకొంది. సదాశివపేట మున్సిపల్లో 23 వార్డులు ఉన్నాయి. ఇందులో 12 వార్డుల్లో మెజార్టీ ఉన్న పార్టీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించే అవకాశాలు లేనందువల్ల ఎంఐఎం, బీజేపీ పార్టీలతో పాటు ముగ్గురు స్వతంత్రులు గెలిచే అవకశాలు ఉన్నందువ్లల వారి మద్దతు తప్పనిసరి. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏరాజకీయ పార్టీకూడా చెర్మైన్ అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయలేదు. రెండు పార్టీల్లోను చైర్మన్ పేరు ప్రకటించనందువల్ల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుందామని చెర్మైన్ అభ్యర్థి ఏవరో ఫలితాలు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనున్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అశిస్తున్న ఆశావహులు పార్టీ ముఖ్యులతో కలిసి ముందుగా మెజార్టీ సభ్యులను తమ అదుపులో పెట్టుకునేందుకు ఇప్పటి నుంచి గెలిచే అవకాశాలు ఉన్న కౌన్సిలర్లకు ప్రలోభాలు పెడుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేయాలని వీరు బేరసారాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరో పక్క 12న కౌంటింగ్ పుర్తయి ఫలితాలు వెలువడినా తరువాత గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను జూన్ రెండు తర్వాతనే చేపట్టేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ అప్పటి వరకు క్యాంపులు నిర్వహించే అలోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఎప్పుడుంటుందో తెలియని పక్షంలో క్యాంపులు నిర్వహించడం చాల ఖర్చుతో కూడుకున్న పనే. అయినా క్యాంపులు నిర్వహించకపోతే రోజు టెన్షన్ పడాల్సి వస్తుందని మెజార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించడమే ఉత్తమమని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఎమ్మెల్యే, ఎంపీ ఓటు మున్సిపల్ చెర్మైన్ ఎన్నికల్లో కీలకం కావడంతో వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపడతారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సంగారెడ్డిలోగాని సదాశివపేట మున్సిపల్ పరిధిలో గాని తన ఓటు హక్కును వినియోగించుకునే వీలుంది. మెదక్ ఎంపీ విషయానికి వస్తే అయన మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఎక్కడో ఒకచోట ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.