వరుడా ఇదేమి చోద్యం.? | Groom Escape to Marriage Function Hall | Sakshi
Sakshi News home page

కల్యాణ మండపం నచ్చలేదని వరుడు పరార్‌

Published Sat, Mar 3 2018 5:28 PM | Last Updated on Sat, Mar 3 2018 5:28 PM

Groom Escape to Marriage Function Hall - Sakshi

సాక్షి, కర్ణాటక (దేవనహళ్లి) : కల్యాణమండపం నచ్చడం లేదని వరుడు ఇంటి నుంచి ఉడాయించాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని పట్టుకొచ్చి పోలీస్‌ స్టేషన్‌లో వివాహం జరిపించారు. ఈ ఘటన దేవనహళ్లి తాలూకా విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. తాలూకాలోని సుణ్ణఘట్ట గ్రామానికి చెందిన ఆనంద్‌ అనే యువకుడికి, తరహుణసె గ్రామానికి చెందిన శోభ అనే యువతికి స్థానిక పటాలమ్మ కల్యాణమండపంలో శుక్రవారం వివాహం జరపాలని పెద్దలు నిశ్చయించారు. వధువు తరపు పెద్దలు వధువుతో కలిసి కల్యాణ మండపం చేరుకున్నారు. ఇంతలో వరుడు ఆనంద్‌ వధువు బంధువులకు ఫోన్‌ చేసి తనకు ఈ వివాహం ఇష్టంలేదని చెప్పి ఉడాయించాడు. కంగారుపడ్డ వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై శ్రీనివాస్‌ సాయంత్రానికల్లా వరుడిని పట్టుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోనే వధువుకు తాళికట్టించి వివాహం జరిపించేశారు. వివాహం ఎందుకు వద్దన్నావు అని పోలీసులు ప్రశ్నించగా కల్యాణమండపం నచ్చలేదని, అందుకే వివాహం వద్దన్నానని నవ్వుతూ సమాధానం చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement