
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విస్తుపోయే సంఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి 7వ తరగతి చదువుతున్న పిల్లాడితో పరారీ అయిన సంఘటన స్థానికంగా చర్చనియాంశంగా మరింది. దీనిపై బాలుడి కుటుంబ సభ్యలు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేడయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. కంపియాగంజ్‌కు చెందిన ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల కుర్రాడితో ఆమె ఇటీవల పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ కుర్రాడు తరచూ వివాహిత దగ్గరికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మరింత సన్నిహితం పెరిగింది.
ఇక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సదరు మహిళ కుర్రాడితో ఈనెల 10న పరారైయింది. అది తెలిసి పిల్లాడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయం బయటకు రాకుండా కుటుంబ సభ్యులు పిల్లాడి కోసం వెతకడం మొదలు పెట్టారు. ఎంతకి వారి ఆచూకి తెలియకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన సంగతి చెప్పి తమ పిల్లాడి వెతికి పెట్టమని పోలీసులను అతడి కుటుంబ సభ్యులు కోరారు. మొదట ఈ విషయం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికి పోలీసులకు కూడా వారి ఆచూకి తెలియరాలేదని సమాచారం
చదవండి:
మైనర్‌తో ప్రేమ.. పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లో..
భర్తపై హత్యాయత్నం కేసులో వీడిన ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment