ముగ్గురు విద్యార్థుల పరార్‌ | three students escape from home | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థుల పరార్‌

Published Thu, Sep 21 2017 7:31 AM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM

పరార్‌ అయిన విద్యార్థులు - Sakshi

పరార్‌ అయిన విద్యార్థులు

ఇళ్ల నుంచి పారిపోయిన వైనం
రాయగడ : రాయగడ సెంట్‌జేవియర్‌ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ నెల 19వ తేదీన తమ ఇళ్లల్లో ప్రైవేటు కు వెళతాం అని చెప్పి పరార్‌ అయినట్టు తెలిసింది. రాయగడ రైతులకాలనీ, న్యూకాలనీ, రైల్వే కాలనీలో ఉంటున్న కె.అవినాష్, ఎస్‌.శ్రీనివాసు, టి.పవన్‌ అనే ముగ్గురు విద్యార్థులు స్నేహితులు. మంగళవారం వీరు ముగ్గురు ప్రైవేటుకు వెళతామని ఇంట్లో చెప్పి వెళ్లిపోయారు. రాత్రి అయినా తిరిగి ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

అయితే వీరు వినియోగించిన మోటార్‌సైకిల్‌ రాయగడ బస్‌స్టాండులో లభించింది. ఈ ముగ్గురు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లి ఉంటారని వారు కుటుంబీకులు అనుమానిస్తున్నారు. అయితే వీరి సెల్‌ఫోన్‌ నెట్‌వర్కు ఆధారంగా హట్‌శశికళ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై అవినాష్‌ తల్లి సూజాత, ఇతర విద్యార్థుల కుటుంబ సభ్యులు రాయగడ పోలీసులను బుధవారం ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. దీనిపై ఐఐసీ ఆర్‌.కె.పాత్రో మాట్లాడుతూ పిల్లల ఆచూకీ తెలుసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement