
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 1/45 చౌరస్తాలో సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే కారులో నుంచి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్‌లోకి వెళ్లిన సమయంలోనే ఈ ఉదంతం చోటు చేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పొన్నాల తన మనవడితో కలిసి కారులో జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్–1 వైపు షాప్‌కు వచ్చాడు. కారు పక్కన ఆపి లోపలికి వెళ్లాడు. అదే సమయంలో సినిమా షూటింగ్ వాహనం రివర్స్ తీసుకునే క్రమంలో చూసుకోకుండా పొన్నాల కారు ముందు భాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.