కొన్ని సంఘటనలు చూస్తుంటే భూమ్మీద నూకలుంటే ఎవరేం చేయలేరంతే.. అనే సామెత నిజమనిపించక మానదు. చైనాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. రెస్టారెంట్‌లో వంట వండుతుండగా.. దాదాపు తినడానికి సిద్ధమైన వేడి వేడి రసంలో నుంచి ఓ క్రేఫిష్(ఎండ్రికాయను పోలిన చేప) బయటపడి తన ప్రాణాలను నిలుపుకుంది.