బనశంకరి : ఓ టెక్కీతో నిశ్చితార్థం చేసుకున్న ఓ యువతి మరో యువకుడిని వివాహం చేసుకున్న సంఘటన హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. .హాసన్ జిల్లా సకలేశపుర తా లూకా యసళూరు గ్రామానికి చెందిన యువతితో బెంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివా హం చేయడానికి పెద్దలు రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిపించారు. ఆదివా రం (19న) హాసన్‌లో వివాహ ముహుర్తం నిర్ణయించారు. అయితే సదరు యువతి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన యువకుడితో గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 11న వివాహం చేసుకుంది.
ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. శనివారం రాత్రి యువతి ఇంట్లో పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయాలు నిర్వహిం చారు. అనంతరం రాత్రి అందరూ నిద్రకు ఉపక్రమించిన అనంతరం యువతి అదృశ్యమైంది. తెల్లవారు జామున కుటుంబ సభ్యులు యువతి కోసం గాలించారు. ఈ సమయంలో ఇండోర్ యువకుడు మొబైల్ వాట్సాస్ నుంచి ఇద్దరికీ వివాహమైన ఫొటో, వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను అప్‌లోడ్ చేశాడు. దీన్ని గమనించిన రెండు కుటుంబాలు షాక్‌కు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment