
ప్రేమించిన అమ్మాయితో వరుడు వెళ్లిపోయాడు
ఖమ్మం: సాధారణంగా పెళ్లంటే మీరేం చేస్తారు.. చాలా ఆనందంగా భావి జీవితం గురించి కలలు కంటూ ఉంటారు. మరికొద్ది గంటల్లో వివాహం జరగబోతుంటే ఓ చక్కటి అనుభూతిలోకి వెళ్లిపోతారు. అయితే తాళి కట్టాల్సిన వరుడు ఏకంగా తన వివాహాన్ని వదిలేసి ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
తామేపల్లి మండలం గరిడేపల్లిలో ఈరోజు ఉదయం 9 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. అంతకన్నా ముందే ఆ కాబోయే వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడు. దాంతో ఇరు కుటుంబాల వారు షాక్ తిన్నారు. వరుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.