వందేభారత్‌, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం | Vande Bharat and Jan Shatabdi Express Escaped Accident In Gaya Overhead Wire Was Broken, See Details | Sakshi
Sakshi News home page

వందేభారత్‌, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం

Published Mon, Jun 10 2024 7:34 AM | Last Updated on Mon, Jun 10 2024 10:11 AM

Vande Bharat and Jan Shatabdi Express Escaped Accident

బీహార్‌లోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో ‍ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్‌లో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

గయ జిల్లాలో గల ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్   రైల్వే సెక్షన్‌ పరిధిలోని మాన్‌పూర్‌ జంక్షన్‌లో హోమ్‌ సిగ్నల్‌ దగ్గర ఓవర్‌హెడ్‌ వైరు తెగిపోయింది. ఈ నేపధ్యంలో రాంచీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ-పట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను ముందుజాగ్రత్త చర్యగా అంతకు ముందుగల స్టేషన్‌లలో నిలిపివేశారు. తెగిన వైర్‌ను సరిచేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో వందే భారత్, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణికులు పలు ఇబ్బందులు  ఎదుర్కొన్నారు.

మాన్‌పూర్ జంక్షన్ హోమ్ సిగ్నల్ సమీపంలో ఓవర్ హెడ్ వైరు తెగిపోవడంతో రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో ట్రాక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, ఇతర విభాగాలకు చెందిన బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి తొమ్మిది గంటలకు మరమ్మతు పనులు పూర్తయ్యాక ఈ మార్గంలోని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గుర్పా రైల్వే స్టేషన్‌లో, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను టంకుప్ప రైల్వే స్టేషన్‌లో నిలిపివేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement