jan shatabdi express
-
వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
బీహార్‌లోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్లో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.గయ జిల్లాలో గల ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్ పరిధిలోని మాన్పూర్ జంక్షన్లో హోమ్ సిగ్నల్ దగ్గర ఓవర్‌హెడ్ వైరు తెగిపోయింది. ఈ నేపధ్యంలో రాంచీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ-పట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను ముందుజాగ్రత్త చర్యగా అంతకు ముందుగల స్టేషన్లలో నిలిపివేశారు. తెగిన వైర్‌ను సరిచేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో వందే భారత్, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.మాన్పూర్ జంక్షన్ హోమ్ సిగ్నల్ సమీపంలో ఓవర్ హెడ్ వైరు తెగిపోవడంతో రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో ట్రాక్షన్ డిపార్ట్మెంట్, ఇతర విభాగాలకు చెందిన బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి తొమ్మిది గంటలకు మరమ్మతు పనులు పూర్తయ్యాక ఈ మార్గంలోని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గుర్పా రైల్వే స్టేషన్లో, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను టంకుప్ప రైల్వే స్టేషన్లో నిలిపివేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. -
చుక్ చుక్ రైలు.. 35 కి.మీ. వెనక్కి
నైనిటాల్ : ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్‌కి వెళుతున్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ హఠాత్తుగా వెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. డ్రైవర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగకుండా 35 కి.మీ. వెనక్కి ప్రయాణించింది. చివరకు ఖాతిమా స్టేషన్లో ఆగడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి బుధవారం బయల్దేరిన రైలు తానక్‌పూర్ చేరుతుందనగా రైల్వే ట్రాక్‌పైనున్న జంతువుని ఢీకొట్టింది. దీంతో రైలు నియంత్రణ కోల్పోవడమే కాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెనక్కి మళ్లింది. డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తే అవి ఫెయిల్ అయ్యాయి. రైల్వే బోగీల మధ్యనున్న ప్రెజర్ పైపులు లీక్ కావడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యాయని భావిస్తున్నారు. తానక్‌పూర్ కొండల మధ్య ఉండడంతో రైలు వెనక్కి పరుగులు తీసిందని చెప్పారు. -
విధ్వంసానికి ప్లాన్.. రైలు పట్టాలపై అడ్డంగా..
ముంబయి: మొన్న కాన్పూర్.. నిన్న విజయనగరం.. నేడు ముంబయి.. ఈ మూడింట్లో రెండు చోట్ల భీకర రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా ముంబయిలో మాత్రం డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే గణతంత్ర దినోత్సవ వేళ మరో విషాదాన్ని గురించి చర్చించుకోవాల్సి వచ్చేది. గుర్తు తెలియని దుండగులు ఎవరో పట్టాలపై అడ్డంగా పెద్ద విరిగిన రైలుపట్టాను పెట్టారు. దాదాపు 15 మీటర్ల పొడవుండే పట్టాను రైలు ప్రమాదానికి గురయ్యేలా ఉంచి విధ్వంసక రచనకు దిగారు. ఈ ఘటన బుధవారం ముంబయిలోని దివా జంక్షన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. మడ్గావ్ నుంచి దాదార్‌కు వెళుతున్న జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఆ సమయంలో పట్టాలపై వెళుతోంది. అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా అతడు ముందుగానే పట్టాలపై అడ్డంగా పెట్టిన మరో పట్టాను గుర్తించి అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. అనంతరం కొంతమంది సహాయకుల ద్వారా దానిని పక్కకు తీసి పడేసి పదిహేను నిమిషాలు ఆలస్యంగా తిరిగి రైలు బయలుదేరింది. దీనిపై అత్యున్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిల్లో విధ్వంసక శక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు తలెత్తిన నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఈ ఘటన రైల్వే అధికారుల్లో మరింత గుబులు రేకెత్తిస్తోంది. -
రైల్లో భారీగా పాత రూ.500 నోట్లు
బిహార్: డీమానిటైజేషన్ తరువాత రద్దయిన రూ.500, 1000 నోట్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్న సంఘటనలు ఇంకా నమోదవుతూనే వున్నాయి. తాజాగా బీహార్ లోని గయనలో ఇఒక రైలు బోగీలో 35 లక్షల విలువైన రద్దయిన రూ.500 సంచిని అధికారులు గుర్తించారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో గుర్తుతెలియని బ్యాగ్ నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ కస్టమ్స్ అధికారులు ఈ భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగ నవంబరు 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం చేపట్టిన ఈ చర్య సామాన్యలకు పలు కష్టాలను తెచ్చిపెట్టింది. నగదు కొరత సమస్యను అధిగమించేందుకు ఆర్థిక శాఖ, ఆర్ బీఐ ఎన్ని ఉపశమన చర్యల్ని చేపడుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి.ఏటీఎం, బ్యాంకు కేంద్రాల వద్ద జనం క్యూలు అంతకంతకూ పెరుగుతున్నాయి.