
బీజింగ్ : కొన్ని సంఘటనలు చూస్తుంటే భూమ్మీద నూకలుంటే ఎవరేం చేయలేరంతే.. అనే సామెత నిజమనిపించక మానదు. చైనాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. రెస్టారెంట్‌లో వంట వండుతుండగా.. దాదాపు తినడానికి సిద్ధమైన వేడి వేడి రసంలో నుంచి ఓ క్రేఫిష్(ఎండ్రికాయను పోలిన చేప) బయటపడి తన ప్రాణాలను నిలుపుకుంది.
మరుగుతున్న రసంలోంచి పాత్రపై భాగానికి చేరుకున్నక్రేఫిష్ అందులోంచి బయటపడ్డానికి తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు అది విజయం సాధించింది. అంత వేడిగా ఉన్న రసంలో నుంచి క్రెఫిష్ బయటపడటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన క్రేఫిష్‌ను రెస్టారెంట్ సిబ్బంది పట్టుకున్నారు. తిరిగి దానిని వండేందుకు సిద్దపడ్డారు. కానీ జూక్ అనే వ్యక్తి దానిని పెంచుకోవడానికి ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment