పొరపాటున చేప మీద కూర్చున్నాడంతే! | Fish Stucked Into Mans Rectum After He Sits On It | Sakshi
Sakshi News home page

పొరపాటున చేప మీద కూర్చున్నాడంతే!

Published Thu, Jun 11 2020 12:19 PM | Last Updated on Thu, Jun 11 2020 10:20 PM

Fish Stucked Into Mans Rectum After He Sits On It - Sakshi

బయటకు తీసిన చేప, ఎక్స్‌ రే దృశ్యం

బీజింగ్‌ : పొరపాటున ఓ వ్యక్తి చేప మీద కూర్చోవటంతో అది కాస్తా అతడి పురీషనాళం(మలద్వారం)లోకి చొరబడింది. ఈ సంఘటన దక్షిణ చైనాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ చైనా గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి పొరపాటున చేపమీద కూర్చున్నాడు. దీంతో అది అతడి పురీషనాళంలోకి చొరబడింది. అయితే దాన్ని బయటకు లాగే ప్రయత్నంలో అతడు విఫలమయ్యాడు. ఆ తర్వాతి నుంచి అతడి కడుపులో నొప్పి ప్రారంభమవ్వటంతో దగ్గరలోని పీపుల్స్‌ ఆసుపత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడి పురీషనాళంలో ఏదో అడ్డం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఎక్స్‌రే తీయగా అది ఓ చేప అని తేలింది. కొన్ని గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఓ పెద్ద చేపను బయటకు తీశారు.

చదవండి : చైనా వాల్‌ యుద్ధం కోసం కాదట..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement