
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చెన్నై, కాంచీపురం జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టి.. ఐదవ ప్లాట్‌ఫాంలో ఉంచిన 10 బస్తాల రేషన్‌బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని ఒడిశాకు తరలించేందుకు య త్నించిన పులియాంతోపు ప్రాంతానికి చెందిన బాలాజీ గూండా చట్టం కింద అరెస్టు చేశారు.
కాంచీపురంలో..
స్థానిక అరక్కోణం రోడ్డులో పోలీసులు మంగళ వారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈసమయంలో కాంచీపురానికి చెందిన సుదర్శన్ (35) బైక్‌లో రేషన్‌బియ్యం తీసుకెళుతున్నట్లు గుర్తించారు. అతడిచ్చిన సమాచారంతో ఇదేవ్యాపారం చేస్తున్న అతడి స్నేహితులు పార్తీబన్ (47), రాజేష్ (38ను కూడా అరెస్టు చేశారు. వీరు ఇతర రాష్ట్రాలకు తరలించడానికి రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని దాచి ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తిరువళ్లూరులో.. 3.5 టన్నులు సీజ్
తిరువళ్లూరు: గుమ్మిడిపూండీ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 3.5 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు ఉపయోగించిన మినీలారీనీ సీజ్ చేసిన పోలీసులు, ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రహస్య సమాచారం మేరకు.. పుడ్‌సెల్ ఇన్పెక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో ఎలావూర్ వద్ద పోలీసులు మంగళ వారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న మినీలారీని తనీఖీ చేశారు. అందులోని మూడున్నర టన్నుల రేషన్ బియాన్ని సీజ్ చేశారు. అనంతరం స్మగ్లింగ్‌కు ఉపయోగించిన మినీ లారీని సీజ్ చేశారు. నిందితులు తమిళనాడుకు చెందిన వీరమణి(29), కుమార్(31)గా గుర్తించారు.
చదవండి: వాట్సప్ చూస్తోందని చెల్లిని చంపిన అన్న
Comments
Please login to add a commentAdd a comment