విజయవాడలో రెండు రైళ్లకు తప్పిన ముప్పు | Missed two trains threat to Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో రెండు రైళ్లకు తప్పిన ముప్పు

Published Fri, Sep 29 2017 1:05 AM | Last Updated on Fri, Sep 29 2017 3:19 AM

Missed two trains threat to Vijayawada

రైల్వేస్టేషన్‌ (విజయవాడ): రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది. విజయవాడ రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ సీహెచ్‌ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6వ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన ధన్‌బాద్‌– అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌ (13351)లోని జనరల్‌ బోగీ కింద చక్రం స్ప్రింగ్‌ విరిగిపోవడాన్ని గమనించిన పాయింట్స్‌మెన్‌ వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది మరో బోగీని మార్చి ఉదయం 9.20 గంటలకు పంపించారు.

అలాగే గురువారం రాత్రి విజయవా డ రైల్వేస్టేషన్‌లోని 7వ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి పూరి– ఓఖా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ (18402)లోని స్లీపర్‌ బోగీకి కూడా చక్రం స్ప్రింగ్‌ విరిగిపోవడాన్ని గమనించిన పాయింట్స్‌మెన్‌ వెంటనే మరొక బోగీని అమర్చి రైలును సురక్షితంగా పంపించారు. పెనుప్రమాదం నుంచి తప్పించి రైళ్లను సురక్షితంగా పంపిన రైల్వే అధికారులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement