పల్లెటూర్
మహానగరం సంక్రాంతి బాట పట్టింది. భాగ్యనగర వాసులు పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్లారు.గురువారం కూడా రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. టికెట్లు దొరకనివారు కార్లు, ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. అరకొర రైళ్లు, బస్సుల్లో అదనపు చార్జీల మోత, ప్రైవేట్ బస్సుల రెట్టింపు దోపిడీ ప్రయాణాన్ని భారంగా చేశాయి.
జనరల్ బోగీల్లో, ప్యాసింజర్ రైళ్లలో బయలుదేరిన ప్రయాణికులు రద్దీతో ఇబ్బందులకు గురయ్యారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లుకిటకిటలాడాయి. నగర శివార్లలోని ప్రధాన కూడళ్లలోనూ భారీ ఎత్తున వాహనాలు, ప్రయాణికుల రద్దీ నెలకొంది. పండుగ సందర్భంగా ఈ నాలుగైదు రోజుల్లో సుమారు 15 లక్షల మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లినట్లుఅంచనా. –సాక్షి, సిటీబ్యూరో