న్యూఢిల్లీ: ముంబై సహా దేశంలోని 19 రైల్వే స్టేషన్లకు ఉచితంగా డిజైన్లు ఇచ్చేందుకు ప్రముఖ వాస్తుశిల్పి, పద్మభూషణ్ గ్రహీత హఫీజ్ కాంట్రాక్టర్ సహా పలువురు ముందు కు వచ్చారని ఇండియర్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్‌ఎస్‌డీసీ) ఎండీ, సీఈవో సంజీవ్ కుమార్ లోహియా వెల్లడించారు. దాదాపు 600 రైల్వే స్టేషన్లను మళ్లీ డిజైన్ చేసి, అభివృద్ధి చేయటానికి రైల్వేశాఖ సంకల్పించింది.
రైల్వే పిలుపు మేరకు హఫీజ్ కాంట్రాక్టర్ సహా నలుగురు స్పందించారు. ఈయన రీడిౖ జెనింగ్ ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేసిన వాటిలో ముంబై లోని దాదర్, పరేల్, వడా లా, బంద్రా, ఖర్ స్టేషన్లు ఉన్నాయని లోహి యా తెలిపారు. కాంట్రాక్టర్ ఇచ్చిన డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సరైన డిజైన్ల ఎంపిక కోసం 11 మందితో కూడిన ప్యానె ల్‌ను నియమించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment