ముంబై : దేశంలోని అత్యంత సుందరమైన రైల్వే స్టేషన్ల జాబితాను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. శుభ్రత, పారిశుద్ధ్యతా ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లర్షా స్టేషన్లు ప్రథమ స్థానాన్ని పొందాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సుధీర్ ముంగటివార్ గురువారం తెలిపారు. తమ రాష్ట్రంలోని రెండు స్టేషన్లు సుందరమైన స్టేషన్లుగా ఎంపికైనందుకు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తనను అభినందించారని సుధీర్ సంతోషం వ్యక్తం చేశారు.
చంద్రాపూర్ జిల్లాకు గార్డియన్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్న సుధీర్ మాట్లాడుతూ.. ఏడాది క్రితమే చంద్రాపూర్, బల్లర్షా స్టేషన్ల సుందరీకరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాగ్‌పూర్ ప్రభుత్వ చిత్రకళా మహావిద్యాలయ నుంచి కళాకారులను పిలిపించామన్నారు. వీరి ప్రతిభతో.. బల్లర్షా ఫుటోవర్ బ్రిడ్జిపై చిత్రించిన పులి బొమ్మ ప్రస్తుతం సెల్ఫీ పాయింట్‌గా మారిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
సుందరమైన రైల్వేస్టేషన్ల జాబితాలో కొన్ని..
1. చంద్రాపూర్, బల్లార్షా(మహారాష్ట్ర)
2. మధుబని(బిహార్), మధురై(తమిళనాడు)
మధుబని, బిహార్
మధురై, తమిళనాడు
3. గాంధీధామ్(గుజరాత్), సికింద్రాబాద్(తెలంగాణ), కోట(రాజస్థాన్)
గాంధీధామ్(గుజరాత్)
సికింద్రాబాద్(తెలంగాణ)
కోట(రాజస్థాన్)
Comments
Please login to add a commentAdd a comment