సాక్క్షి, హైదరాబాద్(శేరిలింగంపల్లి): నగర శివారులోనే అతిపెద్దది అయిన లింగంపల్లి రైల్వేస్టేషన్ ఒకప్పుడు కళాహీనంగా ఉండేంది. నిత్యం ప్రయాణికులతో కళగా ఉండే ఈ స్టేషన్ ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంది. స్టేషన్‌లోని గోడలకు వేసిన వివిధ చిత్రాలు వచ్చిపోయే ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి.
చిత్రం చెప్పే అర్థం..
జంతువులు..పక్షులు..పర్యావరణం..స్వచ్ఛభారత్..ఇలా ఎన్నెన్నో చిత్రాలు కొలువుదీరాయి. రైల్వేస్టేషన్‌లోని ప్రతి గోడకు రకరకాల జంతువులు, పక్షులతోపాటు రాజుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబించేలా ఆకట్టుకుంటున్నాయి. పులి, ఏనుగు, నెమలి, ఇతర పక్షుల చిత్రాలు అలరిస్తున్నాయి. గ్రామీణ వాతావరణంతోపాటు జలపాతాలు, పడవలు, సూర్యుడు ఉదయించే దృశ్యాలు ఇలా ఎన్నో చిత్రాలు ప్రయాణికుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి.
శివారులోనే అతిపెద్దది
నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా లింగంపల్లి స్టేషన్‌కు గుర్తింపు ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే సాగుతాయి. పలు కొత్త రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఆరంభించాలనే ఆలోచన కూడా ఉంది.
ఎంఎంటీఎస్ ఇక్కడి నుంచే...
ఎంఎంటీఎస్ రైళ్లను నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఇక్కడి నుంచే బయలుదేరతాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐటీ కారిడార్‌కు కేంద్రంగా ఈ ప్రాంతం మారడంతో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. పలు ఐటీ సంస్థలు తమ సంస్థ ఉద్యోగుల కోసం లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు సైతం నడుపుతున్నాయి. నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా లింగంపల్లి స్టేషన్ అభివృద్ధికి నోచుకుంది
Comments
Please login to add a commentAdd a comment