
జపాన్ రైల్వే స్టేషన్ల మాదిరిగానే..
ఇక భారత రైల్వే స్టేషన్లు జపాన్లోని రైల్వే స్టేషన్లను తలపించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 400 రైల్వే స్టేషన్లను తమ దేశ రైల్వే స్టేషన్ల మాదిరిగా ఆధునీకరించేందుకు జపాన్ ముందుకొచ్చింది
న్యూఢిల్లీ: ఇక భారత రైల్వే స్టేషన్లు జపాన్లోని రైల్వే స్టేషన్లను తలపించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 400 రైల్వే స్టేషన్లను తమ దేశ రైల్వే స్టేషన్ల మాదిరిగా ఆధునీకరించేందుకు జపాన్ ముందుకొచ్చింది. ఇందుకోసం దాదాపు 140 బిలియన్లు వ్యయాన్ని పెట్టుబడులు పెట్టి ఆధునీకీకరణకు అవసరమైన పరిశ్రమలను ఏర్పాటుచేయనుంది. త్వరలోనే ఈ మేరకు జపాన్ నుంచి ప్రత్యేక బృందం వచ్చి అందుకోసం ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయనుంది.
ప్రస్తుతం కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఇప్పటికే జపాన్ ప్రధాని షింజో అబే, ఉప ప్రధాని, ఆర్థికమత్రి థారో అసోతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా భారత్కు చెందిన ప్రజా రవాణా సంస్థలపైన 140 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నట్లు అబే స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతోపాటు రైలు ప్రమాదాలను కూడా పూర్తిగా నిలువరించే సహాయం కూడా చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.