
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలన్నారు. ఈమేరకు సీఎం జగన్ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2022