ఇద్దరు పైలట్లు గల్లంతు | Pawan Hans chopper crash: 2 pilots on board still missing | Sakshi
Sakshi News home page

ఇద్దరు పైలట్లు గల్లంతు

Published Thu, Nov 5 2015 12:51 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

Pawan Hans chopper crash: 2 pilots on board still missing

ముంబై: అరేబియా సముద్రంలో పవన్ హాన్స్ హెలికాఫ్టర్ బుధవారం రాత్రి గల్లంతైంది. ఓఎన్జీసీ స్థావరం నుండి రాత్రి 7 గంటలకు టేక్ ఆఫ్ తీసుకున్న హెలికాఫ్టర్ కొద్దిసేపటికే కంట్రోల్ రూం తో సంబంధాను కోల్పోయింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు గల్లంతయ్యారు. గల్లంతైన పైలట్లను టీకే గుహ, కెప్టెన్ సామ్యూల్లుగా గుర్తించారు. వీరికోసం నావీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఉదయం మంచు ప్రభావం అధికంగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకంగా మారింది. అయితే హెలికాఫ్టర్కు సంబంధించిన కొన్ని శకలాలను గుర్తించినట్లు నావీ సిబ్బంది ప్రకటించారు. కానీ పైలట్లకు సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించలేదు.  ఓఎన్జీసీకి చెందిన ప్రముఖులను ముంబై నుండి తీర ప్రాంతంలోని తమ కంపెనీ క్షేత్రానికి తరలించడానికి పవన్ హాన్స్ హెలికాఫ్టర్లను వాడుతోంది. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్లు మాత్రమే అందులో ప్రయాణిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement