two pilots
-
రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్–21 ఫైటర్ జెట్
బార్మర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన మిగ్–21 యుద్ధ విమానం గురువారం రాత్రి 9.10 గంటలకు రాజస్తాన్‌లోని బార్మర్‌లో నేలకూలింది. ఈ ఘటనలో ఇద్దరు విమానంలోని ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రెండు సీట్లున్న ఈ విమానాన్ని శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఉత్తర్లాయ్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానం భీమ్డా గ్రామం వద్ద నేలకూలి మంటల్లో చిక్కుకుంది. ఘటనా స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల అసలైన కారణాలు తెలుసుకొనేందుకు వైమానిక దళం కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు. మిగ్–21 ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఆరు మిగ్–21 విమానాలు కుప్పకూలాయి. ఐదుగురు పైలట్లు బలయ్యారు. -
కుప్పకూలిన విమానం, విషాదం
మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. సాగర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనర్ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారనీ సీఎంఓ ట్వీట్ చేసింది. `చిమ్స్ అకాడమీ 'విమానం (సెస్నా172) ధానా ఎయిర్‌స్ట్రిప్ వద్ద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా, అదుపు తప్పి పక్కనే ఉన్న మైదానంలో కూలిపోయిందని సాగర్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ సంఘి తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రైనర్ అశోక్ మక్వానా (58), ట్రైనీ పియూష్ సింగ్ (28) మృతి చెందారని తెలిపారు. పొగమంచు కప్పేయడంతో రన్‌వే సరిగా కనిపించక ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు. అటు ఈ సంఘటనను చిమ్స్ అకాడమీ స్థానిక నిర్వాహకుడు రాహుల్ శర్మ ధృవీకరించారు. సెస్నా 172లో గ్లాస్ కాక్‌పిట్‌తో పాటు రాత్రిపూట ప్రయాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలున్నాయని అకాడమీ వర్గాలు తెలిపాయి. అకాడమీ వెబ్సైట్ ప్రకారం, ఇది కమర్షియల్ పైలట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కోర్సులను నడుపుతుంది. प्रदेश के सागर की ढाना हवाई पट्टी पर एक विमान हादसे में दो प्रशिक्षु पायलेट की मौत का दुःखद समाचार प्राप्त हुआ। परिवार के प्रति मेरी शोक संवेदनाएँ। ईश्वर उन्हें अपने श्रीचरणो में स्थान व पीछे परिजनो को यह दुःख सहने की शक्ति प्रदान करे। — Office Of Kamal Nath (@OfficeOfKNath) January 3, 2020 -
2 విమానాల్ని కూల్చాం, పైలట్‌ను పట్టుకున్నాం
ఇస్లామాబాద్/లాహోర్: పుల్వామా ఘటనకు ప్రతీకారంగా మంగళవారం ఐఏఎఫ్ జరిపిన దాడులతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బుధవారం ఉదయం తమ గగనతలంలోకి చొచ్చుకువచ్చిన భారత వైమానిక దళానికి చెందిన రెండు ఐఏఎఫ్ యుద్ద విమానాలను కూల్చివేసి, ఇద్దరు పైలట్లను అరెస్టు చేసినట్లు ప్రకటించుకున్న పాక్.. ఆ తర్వాత మాటమార్చి, ఒక్కరినే పట్టుకున్నట్లు తెలిపింది. ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించింది. పాక్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘పాక్ వైమానిక దళం(పీఏఎఫ్) జెట్ విమానాలు పాక్ గగనతలంలో నుంచే ఎల్వోసీ ఆవల భారత్ లోని భింబేర్ గల్లీ, నరన్ ప్రాంతంలో ఉన్న ఆరు లక్ష్యాలను కచ్చితంగా ఛేదించాయి. అవన్నీ సైనిక పోస్టులు, ఆయుధ డిపోలకు సమీపంగా ఉన్నవే. దాడులు చేయ గలిగిన సత్తా మాక్కూడా ఉందని నిరూపించుకు నేందుకు ఇలా చేసి చూపాం. ఆ తర్వాత ఐఏఎఫ్ విమానాలు మా భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిం చగా వాటిని కూల్చేశాం’అని తెలిపారు. ‘రెండు ఐఏఎఫ్ విమానాల్లో ఒకటి జమ్మూ కశ్మీర్‌లోనూ మరొకటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోను కూలి పోయాయి. వాటిలో ఉన్న ఇద్దరు పైలట్లను అరెస్టు చేశాం. గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించాం. మరొకరు సురక్షితంగా ఉన్నారు’ అని తెలిపారు. ఆ పైలట్ల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు, పత్రాలను ఘఫూర్ మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఆయన 46 సెకన్ల నిడివి ఉన్న వీడి యోను విడుదల చేశారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఒక వ్యక్తి ‘నేను ఐఏఎఫ్ అధికారిని. నా సర్వీస్ నంబర్ 27981’ అని చెబుతున్నట్లుగా అందులో ఉంది. ఆయనే ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ అని ఘఫూర్ అన్నారు. ఆ తర్వాత మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ మరో ప్రకటన విడుదల చేశారు. తమ సైన్యం అదుపులో ఉన్నది ఇద్దరు పైలట్లు కాదు.. వింగ్ కమాండర్ అభినందన్ ఒక్కరే అని పేర్కొన్నారు. పీవోకేలో ఆయనపై కొందరు దాడి చేయగా సైన్యం రక్షిం చిందని తెలిపారు. సైనిక నిబంధనావళి ప్రకారం అభినందన్‌తో వ్యవహరిస్తామని వివరించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్ తాజా పరిణామాలతో పాక్ దేశంలో రెడ్అలర్ట్ ప్రకటించింది. గగనతలాన్ని మూసివేసి, వాణిజ్య విమానాలను రద్దు చేసింది. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. తిరిగి ప్రకటించే వరకు వీటిని సైనిక అవసరాలకు మాత్రమే వాడుకుంటామని అధికారులు తెలిపినట్లు డాన్ న్యూస్ టీవీ తెలిపింది. -
కుప్పకూలిన బీఎస్ఎఫ్ విమానం
* ఇద్దరు పైలట్లు సహా 10 మంది సిబ్బంది దుర్మరణం * శివార్లలో ప్రమాదం న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్ఎఫ్) చెంది న 11 సీట్ల విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న 3 నిమిషాలకే నగర శివార్లలోని ద్వారక సమీపంలో కుప్పకూలింది. విమానంలోని ఇద్దరు పైలట్లతోపాటు ఎనిమిది మంది సాంకేతిక సిబ్బంది దుర్మరణం చెందారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ), డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారుల కథనం ప్రకారం... బీచ్‌క్రాఫ్ట్ సూపర్‌కింగ్ రకానికి చెందిన జంట ఇంజన్ల విమానం జార్ఖండ్ రాజధాని రాంచీ వెళ్లేందుకు ఉదయం 9:37 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే ఎయిర్‌పోర్టుకు వెనక్కి మళ్లే ప్రయత్నంలో అదుపుతప్పింది. ఓ చెట్టును, ఎయిర్‌పోర్టు సరిహద్దు గోడను ఢీకొని మంటలు ఎగజిమ్ముతూ అక్కడున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు ఆవరణలో 9:40 గంటలకు కుప్పకూలింది. వెంటనే 15 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంపై పౌర విమానయానశాఖ విచారణకు ఆదేశించింది. రాంచీలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌కు మరమ్మతుల కోసం సాంకేతిక సిబ్బందిని విమానంలో తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ అవసరాల కోసం 1995లో కొన్న ఈ విమానానికి కెనడాలోని దీని తయారీ ఫ్యాక్టరీలో 6 నెలల కిందట ఇంజన్ ఓవర్‌హాలింగ్ జరిగింది. మృతుల్లో.. చీఫ్ పైలట్, బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భగవతి ప్రసాద్ భట్, కో పైలట్, సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) అధికారి రాజేశ్ శివ్రేన్, డిప్యూటీ కమాండెంట్ డి. కుమార్, ఇన్స్పెక్టర్లు రాఘవేంద్ర కుమార్ యాదవ్, ఎస్.ఎన్. శర్మ, ఎస్ఐలు రవీంద్ర కుమార్, సురేంద్ర సింగ్, సి.ఎల్. శర్మ, ఏఎస్ఐ డి.పి. చౌహాన్, కానిస్టేబుల్ కె.ఆర్. రావత్ ఉన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర వి చారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. రాజ్‌నాథ్ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ప్రధానికి ప్రమాద వివరాలను తెలియజేశారు. -
ఇద్దరు పైలట్లు గల్లంతు
ముంబై: అరేబియా సముద్రంలో పవన్ హాన్స్ హెలికాఫ్టర్ బుధవారం రాత్రి గల్లంతైంది. ఓఎన్జీసీ స్థావరం నుండి రాత్రి 7 గంటలకు టేక్ ఆఫ్ తీసుకున్న హెలికాఫ్టర్ కొద్దిసేపటికే కంట్రోల్ రూం తో సంబంధాను కోల్పోయింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు గల్లంతయ్యారు. గల్లంతైన పైలట్లను టీకే గుహ, కెప్టెన్ సామ్యూల్లుగా గుర్తించారు. వీరికోసం నావీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉదయం మంచు ప్రభావం అధికంగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకంగా మారింది. అయితే హెలికాఫ్టర్‌కు సంబంధించిన కొన్ని శకలాలను గుర్తించినట్లు నావీ సిబ్బంది ప్రకటించారు. కానీ పైలట్లకు సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఓఎన్జీసీకి చెందిన ప్రముఖులను ముంబై నుండి తీర ప్రాంతంలోని తమ కంపెనీ క్షేత్రానికి తరలించడానికి పవన్ హాన్స్ హెలికాఫ్టర్లను వాడుతోంది. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్లు మాత్రమే అందులో ప్రయాణిస్తున్నారు.