బార్మర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన మిగ్–21 యుద్ధ విమానం గురువారం రాత్రి 9.10 గంటలకు రాజస్తాన్‌లోని బార్మర్‌లో నేలకూలింది. ఈ ఘటనలో ఇద్దరు విమానంలోని ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రెండు సీట్లున్న ఈ విమానాన్ని శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఉత్తర్‌లాయ్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానం భీమ్డా గ్రామం వద్ద నేలకూలి మంటల్లో చిక్కుకుంది.
ఘటనా స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల అసలైన కారణాలు తెలుసుకొనేందుకు వైమానిక దళం కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు. మిగ్–21 ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఆరు మిగ్–21 విమానాలు కుప్పకూలాయి. ఐదుగురు పైలట్లు బలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment