
నాసిక్ (మహారాష్ట్ర) : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అసలు హెలికాప్టర్ అచ్చిరానట్లుంది. మరోసారి ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించడంతో హెలికాప్టర్‌ను అనూహ్యంగా దించివేశారు. అయితే, హెలికాప్టర్ సురక్షితంగానే దిగిందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ సంఘటన శనివారం ఉదయం 9.30గంటలకు చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి సహాయకుడు సంతోష్ బారి తెలిపిన వివరాల ప్రకారం ఫడ్నవీస్ నీటి వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్‌తో కలిసి నాసిక్ నుంచి ఔరంగాబాద్‌కు బయలుదేరారు. తొలుత 50 అడుగులు మాత్రమే ఎగిరిన హెలికాప్టర్ ఆ తర్వాత పైకి లేవలేకపోయింది. దీంతో కొద్ది మీటర్ల దూరంలో హెలికాప్టర్‌ను సురక్షితంగా దించి వేశారు. పఢ్నవీస్ కోసం సిద్ధం చేసిన వంట వ్యక్తిని, ఓ సంచిని హెలికాప్టర్‌లో ఎక్కించిన కారణంగానే హెలికాప్టర్ కదలనట్లు గుర్తించి వారిని రోడ్డు మార్గంలో తరలించి మరోసారి హెలికాప్టర్‌లో ఫడ్నవీస్ వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment