Over load
-
కిల్లింగ్.. ఓవర్‌లోడ్!
ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక, కంకర, విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న వాహన యజమానులు ఎ లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదా లకు కారణమవుతుండటంతో అమాయకులు ప్రా ణాలు కోల్పోతున్నారు. క్వారీల నుంచి ఇతర రాష్ట్రాలకు కంకరను తరలించే క్రమంలో గ్రామీణులు టి ప్పర్ చక్రాల కింద నలిగిపోతున్నారు. ఇటీవల కౌ టాల మండలం వైగాం సమీపంలో ఓవర్ లోడ్‌తో వి ద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, ట్రిపర్లు అధిక లోడుతో వరుసగా పదుల సంఖ్యల్లో పల్లెల మీదుగా దూసుకెళ్తున్నాయి. నిత్యం రాకపోకలు సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఓవర్‌లోడ్‌తో భారీ వాహనాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణితోపాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇసుకు అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులతో.. 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే లోడ్‌తో తిప్పుతున్నారు. గతేడాది డిసెంబర్ 4న కౌటాల మండలం యాపలగూడలో ట్రిప్పర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించేందుకు వీలుంటుంది. కానీ 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. కౌటాల మండలం ముత్తంపేట శివారులోని కంకర క్రషర్ల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా కంకర తరలిస్తున్నారు. వాగులు, నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలోనూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేపడుతున్నాం ఓవర్ లోడుతో వెళ్తున్న కంక ర టిప్పర్లు, ఇసుక ట్రాక్టర్లు, విద్యుత్ స్తంభాలు తరలించే ట్రాకర్లను నిత్యం తనిఖీ చేస్తూనే ఉన్నాం. సంబంధిత అధికారులకు సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలను పాటించని వాహనాల యాజమానులకు జరిమానా విధిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తాం. – జి.లక్ష్మి, ఆర్టీవో, ఆసిఫాబాద్ జాడలేని తనిఖీలు.. ఓవర్ లోడింగ్ వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల వరుస ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా అధికారులు ఓవర్ లోడింగ్ వాహనాల ను తనిఖీలు చేసి కనీస జరిమానాలు విధించకపోవడం గమనార్హం. -
సీటింగ్ 30.. ట్రావెలింగ్ 134
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): జైనథ్ మండలం భోరజ్ బస్‌స్టాండ్ సమీపంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సును ఏఎంవీఐ స్రవంతి సీజ్ చేశారు. ఆర్టీసీ అధికారులతో కలిసి 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలతో హెదరాబాద్కు వెళ్తున్న బస్సు (పీవై05ఈ1433)ను తనిఖీ చేయగా అందులో 134 ప్రయాణికులు ఉన్నారు. 30 మంది ప్రయాణించే బస్సులో 134 మందిని తరలిస్తుండటంతో ఓవర్‌లోడ్ కారణంగా బస్సును సీజ్‌చేసి ప్రయాణికులతోసహా ఆదిలాబాద్ బస్‌స్టాండ్‌కు తరలించారు. దీంతో కూలీలు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డారు. రాత్రి ఆదిలాబాద్ బస్టాండ్‌లోనే సేదతీరారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ బస్‌స్టాండ్‌కు చేరుకుని కూలీలతో మాట్లాడా రు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బస్సు ఓనర్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. -
అయ్యో.. ఆటోకెంత కష్టం వచ్చింది
సాక్షి, నెల్లూరు : పరిమితికి మించి ప్రయాణికులు, సరుకులతో ఆటోలు రాకపోకలు సాగించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారుతోంది. ఫలితంగా రోడ్డుపై రాకపోకలు సాగించే వారు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకోవాల్సి వస్తోంది. వెంకటేశ్వరపురంలోని ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌కు చెందిన ఆటోలో వాటర్ ప్యాకెట్ల బస్తాలను పరిమితికి మించి శనివారం తరలిస్తుండగా, ఇలా అదుపుతప్పింది. బరువు కారణంగా ముందు టైరు పైకి లేచింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
గ్రానైట్ రైట్ ‘రాతి’రేల కాసుకో
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వస్తున్న గ్రానైట్ ఓవర్‌లోడ్ వాహనాల నిమిత్తం చెల్లించాల్సిన జరిమానా ఎగ్గొట్టేందుకు అక్రమార్కులు పన్నాగం పన్నారు. దీంతో వాహనాలు రాత్రుళ్లు దొడ్డిదారిన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రాజమండ్రి–హైదరాబాద్ హైవేపై ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వద్ద తెలంగాణ సర్కారు, పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఆంధ్రా ప్రభుత్వం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకున్నాయి. ఓవర్‌లోడ్‌తో వస్తున్న గ్రానైట్ వాహనాలు ఈ చెక్ పోస్టుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ఏపీలోకి వచ్చే వాహనాల నుంచి ఓవర్లోడింగ్కు టన్నుకు రూ.వెయ్యి చొప్పున అధికారులు వసూలు చేస్తారు. ఒక్కో లారీ 20 టన్నుల వరకూ ఓవర్‌లోడ్‌తో వస్తున్నాయి. అంటే ఒక్కోవాహనానికి రూ.20 వేల వరకూ జరిమానా ఎగ్గొట్టడానికి అక్రమార్కులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. తెలంగాణ నుంచి రోజూ వందలాది గ్రానైట్ లారీలు మన రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడ, విశాఖ పోర్టులకు వెళ్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆదాయానికి గండిపడుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో ఉదయం బయలుదేరి..! తెలంగాణలోని ఖమ్మం, ఇతర జిల్లాల నుంచి గ్రానైట్ కాకినాడ, విశాఖపట్నం పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. దీంతో గ్రానైట్ లోడ్ వాహనాలు ఉదయం తెలంగాణలో బయలుదేరి సాయంత్రం, రాత్రికి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకుంటాయి. ఇవి ఎక్కువ ఓవర్‌లోడింగ్‌తో వస్తుంటాయి. ఒక్కో లారీపై సుమారు 60 టన్నుల వరకూ లోడింగ్‌కు అనుమతి ఉంటుంది. అయితే 75 నుంచి 80 టన్నులకుపైగా బరువైన గ్రానైట్ రాళ్లతో ఇవి వస్తున్నాయి. ఓవర్‌లోడ్ ఉంటే బోర్డర్ చెక్‌పోస్టు వద్ద టన్నుకు రూ.వెయ్యి వరకూ జరిమానా చెల్లించాలి. అంటే ఒక్కో లారీకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా కట్టాలి. అయితే ఎక్కువ శాతం రవాణాదారులు జరిమానా ఎగ్గొట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. చాలా వరకూ గ్రానైట్ నకిలీ వే బిల్లులతో రవాణా అవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, మైనింగ్ టాక్స్‌లూ ఎగ్గొడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి పన్నులను చెల్లించకుండా కోట్ల రూపాయల విలువైన రాయిని కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖ అధికారులకుతెలిసినా వారు పట్టించుకోరు. వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లడానికి అభ్యంతర పెట్టకుండా ఉండేందుకు ఆయా శాఖలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. రోజుకు 40 నుంచి 60 లారీల వరకూ ఓవర్‌లోడ్ తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండురోజల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే 11 లక్షల రూపాయల వరకూ జరిమానా వసూలైంది. కళ్లుగప్పేదిలా..! గ్రానైట్ వాహనాలు అధికారుల కళ్లుగప్పి ఆంధ్రాలోకి ప్రవేశించడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు వెళ్తున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు అశ్వారావుపేట, జీలుగుమిల్లి మీదుగా కాకుండా, గంగారం నుంచి రాఘవాపురం మీదుగా ఏలూరు చేరుకుని విజయవాడ– కోల్‌కతా హైవే ఎక్కుతున్నాయి. అదేవిధంగా మేడిశెట్టివారిపాలెం, అడ్డరోడ్డు నుంచి మళ్ళి యర్రగుంటపల్లి, మక్కినవారిగూడెం, లక్ష్మీపురం మీదుగా హైదరాబాద్ –రాజమండ్రి హెవేపైకి చేరుకుని మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఏపీకి రావాల్సిన ఆదాయానికి రూ.కోట్లల్లో గండి పడుతోందని సమాచారం. సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి దొడ్డి దారిన వెళ్తున్న వాహనాల నుంచి పన్నులు వసూలు చేస్తే మన ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. రోజూ ఆంధ్రా సరిహద్దులోకి చేరుకున్నాక రాత్రి 9 గంటల తరువాతే ఈ వాహనాలన్నీ చెక్ పోస్టులు లేని దారుల్లో నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేసిస్తున్నాయి. ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో మరిన్ని చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం ఖాయం. తనిఖీలు నిర్వహిస్తాం చెక్‌పోస్టులు తప్పించుకునేందుకు భారీ వాహనాలు వేరే మార్గాలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నాం. వాణిజ్యపన్నుల శాఖ, రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటాం. మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు.– రేవు ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్ -
రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘనపై ఆర్టీఏ కొరడా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత నిబంధనల ఉల్లం‘ఘను’లు ఠారెత్తిస్తున్నారు. రహదారులపై ఇష్టారాజ్యంగా పరుగులు తీస్తున్నారు. రహదారి భద్రతపై ఎన్ని కఠినమైన చట్టాలను తెచ్చినప్పటికీ వాహనదారులు పెద్దగా లెక్కచేయడం లేదు. నిబంధనల పట్ల అవగాహనారాహిత్యం, నిర్లక్ష్యం రోడ్డు భద్రతకు పెనుసవాల్‌గా మారింది. గత ఐదేళ్లలో ఇలా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన సుమారు 14 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులపై రవాణాశాఖ వేటు వేసింది. 3 నెలల కనిష్ట కాలపరిమితి నుంచి ఏడాది గరిష్ట కాలం వరకు డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. సెల్‌ఫోన్‌డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని తెలిసినప్పటికీ చాలామంది నిబంధనలు పక్కన పెట్టేసి ‘సెల్’మోహనరంగా అంటూ పరుగులు తీస్తున్నారు. మరోవైపు పరిమితికి మించిన ఓవర్లోడింగ్, అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలు ఎక్కువగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో రవాణాశాఖ ‘ఉల్లంఘనుల’పై సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రస్తుతం ఏడాది గరిష్ట కాలానికి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో శాశ్వతంగా రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు రవాణాశాఖ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడేవారిపైన మరింత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాంటి వాహనదారులు తిరిగి డ్రైవింగ్ చేయకుండా నియంత్రించనున్నట్లు చెప్పారు. పరిమితికి మించిన బరువుతో పరుగులు... రాత్రి, పగలు తేడా లేకుండా ఓవర్‌లోడ్ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రైవేట్ బస్సులు నిబంధనలను తుంగలో తొక్కి పరిమితికి మించిన ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్న సుమారు 1000 ప్రైవేట్ బస్సుల్లో 80 శాతం ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని బస్సులు పూర్తిగా సరుకు రవాణా వాహనాలుగా మారాయి. మరోవైపు వివిధ జిల్లాల నుంచి ఇసుక, కంకర, ఐరన్ వంటి వస్తువులను నగరానికి తరలిస్తున్న వాహనాలు సైతం ఓవర్‌లోడ్‌తో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇలా రహదారి భద్రతకు ముప్పుగా మారిన ఓవర్‌లోడ్ వాహనాలు నడుపుతూ పట్టుబడిన 2532 మంది డ్రైవింగ్ లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. ఓవర్‌లోడ్ వాహనాలను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఇలాంటి వాహనాలను సైతం జఫ్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జేటీసీ చెప్పారు. డ్రంకెన్ డ్రైవర్లు... ఓవర్‌లోడింగ్‌తో పట్టుబడి డ్రైవింగ్ లైసెన్సులు కోల్పోయిన వారి తరువాత ఈ ఐదేళ్లలో డ్రంకన్ డ్రైవింగ్‌లో పట్టుబడి లైసెన్సులు పోగొట్టుకున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ పోలీసులు నిరంతర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొంత వరకు ఫలితాన్నిచ్చాయి. గత ఐదేళ్లలో డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో 2117 మంది లైసెన్సులను రద్దు చేశారు. 2016లో 917 లైసెన్సులు రద్దు కాగా, 2017లో 580, 2018లో 439 చొప్పున లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 123 లైసెన్సులను రద్దు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. యధేచ్ఛగా సెల్‌ఫోన్ డ్రైవింగ్... సెల్‌ఫోన్ డ్రైవింగ్ సైతం హడలెత్తిస్తోంది. ఒకవైపు ఫోన్లో మాట్లాడుతూనే మరోవైపు వాహనాలను నడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వాహనాల వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, చివరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు భద్రతకు సవాల్‌గా మారారు. ఇప్పటి వరకు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 720 మంది వాహనదారుల లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. అలాగే పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 87 మంది లైసెన్సులపైన సస్సెన్షన్ విధించింది. ఇక రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు పాల్పడిన 1661 మంది సైతం తమ లైసెన్సులను కోల్పోయారు. వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు రద్దయిన డ్రైవింగ్ లైసెన్సులు ఓవర్లోడింగ్ 2532 ఓవర్‌స్పీడ్ 87 ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడిన గూడ్స్ వాహనాలు 633 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 720 మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు 2117 ప్రమాదాలకు పాల్పడిన వారు 1661 కోర్టు తీర్పులతో లైసెన్సులు కోల్పోయిన వారు 908 ఇతర కేసులు 5313 వివిధ రకాల ఉల్లంఘనలపై గత 5 ఏళ్లలో సస్పెండ్ అయిన మొత్తం డ్రైవింగ్ లైసెన్సులు 13971 -
చిన్న బండి.. లోడు దండి!
సాక్షి, అనకాపల్లి టౌన్ (విశాఖపట్నం): దినదినాభివృద్ధి చెందుతున్న అనకాపల్లి పట్టణంలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధాన రహదారి మినహా మిగతా రహదారులు చిన్నవి కావడంతో ఈ సమస్య తీవ్రంగా ఉంది. విస్తరణకు నోచుకున్న ప్రధాన రహదారిలో వన్‌వే ఆంక్షలు విధించడంతో ఇరుకు వీధి రోడ్లలో కూడా భారీ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వీధుల్లో ద్విచక్ర వాహనాలపై కొంతమంది చిరు వ్యాపారులు పెద్దఎత్తున సామగ్రి కట్టుకొని వెళ్తుండడంతో ఆ వాహనం వెళ్తే గాని మరో వాహనం వచ్చే పరిస్థితి లేదు. పాదచారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారదానది వంతెనపై నుంచి వచ్చే ఆటోలను నెహ్రూచౌక్ మీదుగా వెళ్లనీయకపోవడంతో పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న శ్రీధర్లాడ్జి వీధి రహదారి మీదుగా వెళ్లి రామచంద్ర థియేటర్ ప్రధాన రహదారికి చేరుకోవాల్సి వస్తోంది. ఇరుకుగా ఉండే ఈ రహదారిపై అధికలోడు వాహనాలతో పాటు ఒక్కో సమయంలో భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు నిత్యం ఏర్పడుతున్నాయి. పట్టణంలో దాదాపు అన్ని వీధి రోడ్లలో ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నంబర్లు కూడా కనిపించని రీతిలో.. కొందరు ద్విచక్రవాహనాలపై అధిక లోడుతో ప్రయాణించే సమయంలో వాహనం నంబర్లు కనిపించడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత వాహనదారుడిని పోలీసులుకాని, ఆర్టీవో అధికారులు కాని గుర్తించడం కష్టమే. చూడ్డానికి ద్విచక్ర వాహనమే అయినా రోడ్డంతా ఆక్రమించేలా భారీ సామగ్రితో వెళుతున్నాయి. వీటి కారణంగా ఇతర వాహన చోదకులకు ఇబ్బందుల ఎదురవుతున్నాయి. ప్రధాన రహదారిపై ఆంక్షలు ఎత్తివేయాలి ప్రధాన రహదారులపై ఆంక్షలు ఎత్తివేస్తే ద్విచక్ర, ఆటోరిక్షా వంటి వాహనాలు ఎక్కువగా ఆ రోడ్లపై ప్రయాణిస్తాయి. వీధి రహదారులపై ద్విచక్ర వాహనాలు, పాదచారులు ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. ప్రధాన రహదారిగుండా ఆటోలను వెళ్లనీయకపోవడం, అధికలోడు వాహనాలకు అవే ఆంక్షలు వర్తించడంతో వీధి రహదారుల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తక్షణం ప్రధాన రహదారులపై ఒన్‌వే ఆంక్షలు ఎత్తివేయాలి. –రాజు, వాహనచోదకుడు, నర్సింగరావుపేట అధిక లోడుతో వెళ్తే కఠిన చర్యలు ద్విచక్రవాహనాలపై అధికలోడు వేసుకొని వెళితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. లోడుకు ప్రభుత్వం కొన్ని వాహనాలు సమకూర్చింది. వాటిని మాత్రమే వినియోగించాలి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన వారిపై చర్యలు తప్పవు. – కిరణ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ, అనకాపల్లి -
కొండగట్టు ప్రమాదం వెలికితీసిన బస్సు
-
కొండగట్టు బస్సు ప్రమాదం.. కారణాలు ఇవే!
సాక్షి, జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 38 మంది కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. కారణాలు ఇవే.. కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయలో పడిన ఆర్టీసీ బస్సును అధికారులు గురువారం వెలికితీశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసిన అధికారులు.. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ బస్సు కండిషన్లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. 2007 మోడల్‌కు చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగిందని గుర్తించారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత బస్సును స్క్రాప్ (తుక్కు) కింద భావించి పక్కకు పడేయాలని, కానీ, స్క్రాప్‌గా భావించే బస్సును జగిత్యాల- శనివారంపేట రూటులో ఆర్టీసీ అధికారులు నడపడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెగ్యులర్ బస్సు, రెగ్యులర్ డ్రైవర్ అయినప్పటికీ కాలం చెల్లిన వాహనం కావడం.. ఘాట్‌రోడ్డులో సరిగ్గా బ్రేక్ వేయడానికి వీలుపడకపోవడంతో ప్రమాదం జరిగిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడం, బ్రేక్ రాకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండడం ఈ మహా విషాదానికి కారణమని వారు ప్రాథమికంగా తేల్చినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగానూ సహాయం అందజేస్తాం కరీంనగర్లో చికిత్స పొందుతున్న 36మందిని మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ గురువారం పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షలు, ఆర్టీసీ పరంగా రూ. 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఈటల తెలిపారు. గాయపడ్డవారికి రెండున్నర లక్షల చొప్పున సహాయం అందిస్తామన్నారు. వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వపరంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మందికి రైతు బంధు జీవిత భీమా వర్తిస్తుందని, ఇక, పార్టీ సభ్యత్వం ఉన్న వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రైతుబంధు, పార్టీ సభ్యత్వం వర్తించని వారికి టీఆర్ఎస్ పార్టీపరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. -
అధికలోడ్ లారీలను అరికట్టమని కాళ్లపై పడి వేడుకోలు
-
అదుపు తప్పిందా అంతే..
మెదక్ : ఓవర్‌లోడ్, మితిమీరిన వేగంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా కొంతమందిలో పరివర్తన రావడం లేదు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో ఓ వ్యక్తి ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు చిన్నారులను స్కూటర్‌పై ఎక్కించుకుని సర్కస్ ఫీట్లను తలపించే రీతిలో ఇలా రయ్‌మని దూసుకెళ్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కాడు. -
ఓవర్ లోడ్ !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రానున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి స్థానికంగా ఆటుపోట్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగారు తెలంగాణ పేరుతో విపక్ష పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకోవడం.. ఇంకా చేరికలు కొనసాగుతుండడంతో ఉమ్మడి పాలమూరు ప్రాంతం లో గులాబీ పార్టీ ‘ఓవర్ లోడ్’తో సతమతమవుతోంది. వచ్చే ఎన్నికల్లో చట్టసభలకు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు పెద్దసంఖ్యలో నేతలు క్యూలో ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ కొత్తవారు పోటీకి సై అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఎవరికి టికెట్లు దక్కుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బంగారు తెలంగాణ కోసం... బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు విపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో వచ్చి చేరారు. వీరిలో స్థానిక ప్రజాప్రతినిధులే కాకుండా ఎమ్మె ల్యేలు కూడా ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున గెలిచిన నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో పాటు తాజాగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అబ్రహం, ఎడ్మ కిష్టారెడ్డి సైతం కారెక్కారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఆ శావహుల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. కల్వకుర్తి బరిలో ఐదుగురు... ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా లేని విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి బరిలో నిలిచేందుకు ఇప్పటికే ఐదు మంది ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన జైపాల్‌యాదవ్‌తో పాటు స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని టీఆర్ఎస్ తరఫున పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. వీరితోపాటు పార్టీకి చెందిన గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్ వంటి నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వీరికి తాజాగా మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన ఎడ్మ కిష్టారెడ్డి జత కలిశారు. ఇలా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల జాబితా చేంతాడంతైంది. ఈ మేరకు వీరు నియోజకవర్గంలో తమ పట్టును నిలుపుకునేందుకు ఎవరికి వారు పార్టీలో గ్రూపు లు కడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మె ల్యే బరిలో నిలిచే ఆశావహుల సంఖ్య ఐదుకు చేరడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇది ఇలాగే కొనసాగకుండా అందరు నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ కార్యకలాపాలన్నీ ఒకే తాటిపై కొనసాగేలా చూడకపోతే పార్టీకే నష్టమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గద్వాలలోనూ ఇదే పోరు.. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాలను ఢీ కొట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే స్థానిక పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, పార్టీకి చెందిన బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్, బండ్ల చంద్రారెడ్డి సైతం పోటీలో ఉంటామని చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయి ఎవరికి వారే యము నా తీరు అన్న చందంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా.. ఎన్నికల సమయం నాటికి పరిస్థితులు ఎలా మారతాయి, ఎవరికి టికెట్ దక్కుతుందనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అచ్చంపేటలో నువ్వా–నేనా.. సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అచ్చంపేట నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది ఒక సంప్రదాయంగా నెలకొంది. అందుకు అనుగుణంగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గువ్వల బాలరాజ్ ఎవరు ఊహించని విధంగా బరిలో నిలిచి విజయబావుటా ఎగురవేశారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర స్థాయిలో మెజార్టీ స్థానాలు దక్కించుకుని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇదే సెంటిమెంట్‌గా భావించిన ఆయా పార్టీలు ఈ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలని శాయశక్తులా ప్రయత్నిస్తాయి. అయితే ఈసారి టీఆర్ఎస్ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రాములు సైతం శాసనభ టికెట్ పోటీలో ఉంటారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనే విషయంలో అస్పష్టత నెలకొంది. దీంతో ఇక్కడి కార్యకర్తలు సైతం అయోమయానికి గురవుతున్నారు. అలంపూర్ అబ్రహంకేనా? సరిహద్దు నియోజకవర్గమైన అలంపూర్‌లో కాస్త భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మంధా జగన్నాథం కుమారుడు శ్రీనాథ్ బరిలో నిలిచారు. పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో మందా జగన్నాథం అలంపూర్ నియోజకవర్గంలో అంతా తానై నడిపిస్తున్నారు. కానీ ఇదే నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ఆశపడుతున్నారు. ఇదే ఆలోచనను పార్టీలోని పలువురు ముఖ్యులతో కూడా పంచుకున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా భాస్కర్ దాదాపు ప్రతీరోజూ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో నియోజకవర్గంలోని ఏదో ప్రాంతంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడికే చెందిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అబ్రహం సైతం తాజాగా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అభ్యర్థుల సంఖ్య మూడుకు చేరగా టీఆర్ఎస్ టికెట్ అబ్రహంకే అవకాశం దక్కే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
15 ఆటోల సీజ్
అల్గునూర్(మానకొండూర్): పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న 15 ఆటోలను కరీంనగర్ రవాణా అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఇన్చార్జి డీటీసీ కొండల్రావు ఆదేశాల మేరకు ఎంవీఐ శ్రీనివాస్, ఏఎంవీఐ రజినీదేవి, మధు ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఓవర్‌లోడ్ వాహనాల నియంత్రణకు తనిఖీలు నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, కరీంనగర్‌లోని బొమ్మకల్ క్రాస్ రోడ్డు, కొత్తపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న 15 ఆటోలను పట్టుకొని సీజ్ చేశారు. ఓవర్‌లోడ్‌లో వెళ్తున్న రెండు ఇసుక లారీలు, మూడు కంకర లారీలను కూడా పట్టుకొని జరిమానా విధించారు. -
ఫడ్నవీస్‌కు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నాసిక్ (మహారాష్ట్ర) : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అసలు హెలికాప్టర్ అచ్చిరానట్లుంది. మరోసారి ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించడంతో హెలికాప్టర్‌ను అనూహ్యంగా దించివేశారు. అయితే, హెలికాప్టర్ సురక్షితంగానే దిగిందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ సంఘటన శనివారం ఉదయం 9.30గంటలకు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడు సంతోష్ బారి తెలిపిన వివరాల ప్రకారం ఫడ్నవీస్ నీటి వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్‌తో కలిసి నాసిక్ నుంచి ఔరంగాబాద్‌కు బయలుదేరారు. తొలుత 50 అడుగులు మాత్రమే ఎగిరిన హెలికాప్టర్ ఆ తర్వాత పైకి లేవలేకపోయింది. దీంతో కొద్ది మీటర్ల దూరంలో హెలికాప్టర్‌ను సురక్షితంగా దించి వేశారు. పఢ్నవీస్ కోసం సిద్ధం చేసిన వంట వ్యక్తిని, ఓ సంచిని హెలికాప్టర్లో ఎక్కించిన కారణంగానే హెలికాప్టర్ కదలనట్లు గుర్తించి వారిని రోడ్డు మార్గంలో తరలించి మరోసారి హెలికాప్టర్లో ఫడ్నవీస్ వెళ్లారు. -
చెరకు లారీ బోల్తా..
నారాయణఖేడ్ (మెదక్) : వేగంగా వెళ్తున్న చెరకు లారీ లోడు ఎక్కువవడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా కొట్టింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని మంగల్‌పేట్ గ్రామ హనుమాన్ మందిరం వద్ద 50వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మానూరు నుంచి నిజామాబాద్ వెళ్తున్న చెరకు లారీ మందిరం సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లారీ కింద ఎవరైనా ఇరుక్కున్నారేమో అనే విషయం తెలియాల్సి ఉంది.