ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక, కంకర, విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న వాహన యజమానులు ఎ లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదా లకు కారణమవుతుండటంతో అమాయకులు ప్రా ణాలు కోల్పోతున్నారు.
క్వారీల నుంచి ఇతర రాష్ట్రాలకు కంకరను తరలించే క్రమంలో గ్రామీణులు టి ప్పర్ చక్రాల కింద నలిగిపోతున్నారు. ఇటీవల కౌ టాల మండలం వైగాం సమీపంలో ఓవర్ లోడ్‌తో వి ద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, ట్రిపర్లు అధిక లోడుతో వరుసగా పదుల సంఖ్యల్లో పల్లెల మీదుగా దూసుకెళ్తున్నాయి.
నిత్యం రాకపోకలు
సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఓవర్‌లోడ్‌తో భారీ వాహనాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణితోపాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇసుకు అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులతో.. 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే లోడ్‌తో తిప్పుతున్నారు.
గతేడాది డిసెంబర్ 4న కౌటాల మండలం యాపలగూడలో ట్రిప్పర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించేందుకు వీలుంటుంది. కానీ 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది.
కౌటాల మండలం ముత్తంపేట శివారులోని కంకర క్రషర్‌ల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా కంకర తరలిస్తున్నారు. వాగులు, నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలోనూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తనిఖీలు చేపడుతున్నాం
ఓవర్ లోడుతో వెళ్తున్న కంక ర టిప్పర్లు, ఇసుక ట్రాక్టర్లు, విద్యుత్ స్తంభాలు తరలించే ట్రాకర్లను నిత్యం తనిఖీ చేస్తూనే ఉన్నాం. సంబంధిత అధికారులకు సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలను పాటించని వాహనాల యాజమానులకు జరిమానా విధిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తాం. – జి.లక్ష్మి, ఆర్టీవో, ఆసిఫాబాద్
జాడలేని తనిఖీలు..
ఓవర్ లోడింగ్ వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల వరుస ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా అధికారులు ఓవర్ లోడింగ్ వాహనాల ను తనిఖీలు చేసి కనీస జరిమానాలు విధించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment