tracter accident
-
కిల్లింగ్.. ఓవర్‌లోడ్!
ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక, కంకర, విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న వాహన యజమానులు ఎ లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదా లకు కారణమవుతుండటంతో అమాయకులు ప్రా ణాలు కోల్పోతున్నారు. క్వారీల నుంచి ఇతర రాష్ట్రాలకు కంకరను తరలించే క్రమంలో గ్రామీణులు టి ప్పర్ చక్రాల కింద నలిగిపోతున్నారు. ఇటీవల కౌ టాల మండలం వైగాం సమీపంలో ఓవర్ లోడ్‌తో వి ద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, ట్రిపర్లు అధిక లోడుతో వరుసగా పదుల సంఖ్యల్లో పల్లెల మీదుగా దూసుకెళ్తున్నాయి. నిత్యం రాకపోకలు సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఓవర్‌లోడ్‌తో భారీ వాహనాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణితోపాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇసుకు అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులతో.. 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే లోడ్‌తో తిప్పుతున్నారు. గతేడాది డిసెంబర్ 4న కౌటాల మండలం యాపలగూడలో ట్రిప్పర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించేందుకు వీలుంటుంది. కానీ 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. కౌటాల మండలం ముత్తంపేట శివారులోని కంకర క్రషర్ల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా కంకర తరలిస్తున్నారు. వాగులు, నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలోనూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేపడుతున్నాం ఓవర్ లోడుతో వెళ్తున్న కంక ర టిప్పర్లు, ఇసుక ట్రాక్టర్లు, విద్యుత్ స్తంభాలు తరలించే ట్రాకర్లను నిత్యం తనిఖీ చేస్తూనే ఉన్నాం. సంబంధిత అధికారులకు సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలను పాటించని వాహనాల యాజమానులకు జరిమానా విధిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తాం. – జి.లక్ష్మి, ఆర్టీవో, ఆసిఫాబాద్ జాడలేని తనిఖీలు.. ఓవర్ లోడింగ్ వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల వరుస ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా అధికారులు ఓవర్ లోడింగ్ వాహనాల ను తనిఖీలు చేసి కనీస జరిమానాలు విధించకపోవడం గమనార్హం. -
Tamil Nadu: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి
వేలూరు: వానియంబాడి సమీపంలో బాలుడు ట్రాక్టర్‌పై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాక్టర్‌తో పాటు బాలుడు బావిలో పడి మృతిచెందాడు. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని చిన్నమోటూరుకు చెందిన సౌందర్‌రాజన్ తన ట్రాక్టర్‌ను తీసుకుని అదే గ్రామానికి రాజంద్రన్ పొలంలో దున్నేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లాడు. క్రిష్ణన్ కుమారుడు సంజీవి(16) ట్రాక్టర్ నడుపుతూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌తో పాటు సంజీవి కూడా సమీపంలోని 60 అడుగుల లోతు ఉన్న బావిలో పడ్డాడు. గ్రామస్తుల సమాచారంతో వానియంబాడి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగు వ్యవ సాయ మోటార్లను అమర్చి నీటిని బయటకు తోడి క్రేన్ సాయంతో ట్రాక్టర్‌ను, బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అంబలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముగ్గురి ప్రాణాల్ని బలిగొన్న కరోనా భయం -
నెల్లూరులో ట్రాక్టర్ బోల్తా: ఐదుగురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ చేపల చెరువులో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఐదుగురి మృతితో వారి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), అబ్బుకోటిపెంచాలయ్య(60), తాంధ్రావెంకతరమనమ్మ(19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లంతా పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: మరదలిని ఆరేళ్లుగా వేధిస్తున్న బావ.. దీంతో.. -
పాటలు వింటూ ట్రాక్టర్ డ్రైవింగ్.. లింక్ తెగిపోయినా..
సాక్షి,మహబూబాబాద్: మిర్చి ఏరేందుకు కూలీలను తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదానికి గురికావడంతో 26 మంది కూలీలు గాయపడిన ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. డ్రైవర్ ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడంతో పాటు డెక్‌లో పాటలు పెట్టుకుని వింటూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం ఆమనగల్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 30 మంది కూలీలు ఓ ట్రాక్టర్లో అదే గ్రామం పక్కన ఉన్న గుండాలగడ్డ తండాలో మిర్చి ఏరేందుకు బయలుదేరారు. మరోపది నిమిషాల్లో పొలానికి చేరుకుంటామనగా, ట్రాలీకి, ఇంజిన్‌కు మధ్య ఉండే లింక్ రాడ్ తెగిపోయింది. ఈ విషయాన్ని గమనించకుండా డ్రైవర్ అలాగే ముందుకెళ్లిపోగా.. ట్రాలీ కొంత దూరం దూసుకెళ్లి రోడ్డుపై దిగబడి ఆగిపోయింది. ఈ కుదుపునకు ట్రాలీలోని కూలీలందరూ ఒకరిపై ఒకరు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్ఐ రమేశ్‌బాబు, పోలీసు సిబ్బందితో పాటు స్థానికుల సాయంతో క్షతగాత్రులను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో 14 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా.. మరో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇంజిన్‌పై కూర్చున్న నలుగురు కూలీలు క్షేమంగా బయటపడ్డారు. ఆరెపల్లి లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆరెపల్లి వసుమతికి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: విశాఖ కార్పొరేటర్ ఆకస్మిక మృతి -
పాఠశాలలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. మహిళ మృతి
సాక్షి, మధిర : డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలలోకి దూసుకుపోయింది. వంట చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. పాఠశాల హెచ్ఎం ఆదినారాయణ కథనం ప్రకారం... మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తరగతులు పూర్తయిన అనంతరం మధ్యాహ్న భోజనం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పంతంగి నర్సింహారావు అనే ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ట్రాక్టర్ నడిపాడు. ఆ ట్రాక్టర్ అదుపుతప్పి పాఠశాలలోకి దూసుకువచ్చి అక్కడే వంటచేస్తున్న వంట మనిషి జాన్‌పాటి లక్షి్మ(65)ని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, నర్సింహారావు మద్యం మత్తులో అతివేగంగా ట్రాక్టర్ నడపడంతో అదుపుతప్పి పాఠశాల ఆవరణలోకి దూసుకుపోయింది. ఈ ఆవరణలో ఉన్న జాతీయ జెండా దిమ్మెసైతం ధ్వంసమైంది. ఈ దిమ్మెను ఢీకొట్టి తరగతిగదిలోకి దూసుకుపోవడంతో తలుపులు, తరగతి గోడసైతం కుప్పకూలిపోయాయి. హఠాత్పరిణామంతో.. అతిసమీపంలో ఉన్న విద్యార్థులందరూ భయంతో పరుగులు తీశారు. తరగతి గదిలోనే విద్యార్థులు ఉన్నట్లయితే ఈ సంఘటనలో ఎంత ప్రాణనష్టం జరిగి ఉండేదోనని ఆ సంఘటన తీరును చూసిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు. మృతురాలి భర్త గతంలోనే చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లక్ష్మి సుమారు 15 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట తయారు చేస్తోంది. రోజూ నాణ్యమైన భోజనాన్ని తయారుచేయడం, విద్యార్థులతో కలిసిపోవడం, గ్రామస్తులతో కలివిడిగా ఉండే లక్ష్మి మృతిని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, మండల విద్యాశాఖాధికారి వై.ప్రభాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ లవణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి
సాక్షి, నల్గొండ : నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ (ఆరెంజ్ ట్రావెల్స్) బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నకిరేకల్ మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన వీరు.. చెరువు అన్నారం వైపు ట్రాక్టర్‌పై గడ్డి కోసం వెళ్లారు. అదేసమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న ఐదుగురిలో ఒకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణిస్తున్న వారు మరో బస్సెక్కి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ ఘటనపై కట్టంగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఘోర ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
సాక్షి, ఎన్పీకుంట: జాతర నుంచి ఇళ్లకు బయల్దేరిన ఇద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వివరాల్లోకెళ్తే... ఎన్పీకుంట మండలం మండెంవారిపల్లికి చెందిన పలువురు ఆదివారం తలుపుల మండలం పంతులోల్లపల్లిలో గంగమ్మ జాతరకు వెళ్లారు. సోమవారం ట్రాక్టర్లో తిరుగుపయనమయ్యారు. ఎన్పీకుంటలోని కొత్తరోడ్డు సమీపాన సీతారామ్ బావి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో హరినాయుడు (33), గిరినాయుడు (12) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. కదిరి రూరల్ సీఐ రెడ్డప్ప, స్థానిక ఎస్ఐ యతీంద్ర తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను 108 ద్వారా కదిరి ఆస్పత్రికి తరలించారు. -
మూసీ దుర్ఘటన; ఆస్పత్రి వద్ద ఆందోళన
సాక్షి, భువనగిరి(యాదాద్రి ) : మూసీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడడంతో 15 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. వేములకొండకు చెందిన 30 మంది మహిళా కూలీలు పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లున్న క్రమంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మృతదేహాలను స్థానిక వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంమయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ తరపున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ప్రకటించారు. వారి పిల్లల చదువులకయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు. అలాగే, తన వంతుగా ఫైళ్ల ఫౌండేషన్ తరపున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున శేఖర్‌రెడ్డి సాయం ప్రకటించారు. కాగా, 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి వెళ్లిపోతున్న మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్, సీపీఐ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనూ, క్షతగాత్రులకు వైద్యసాయం అందించడంలోనూ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మృతుల కుంటుంబాలకు నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు, ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోరుతూ ఆస్పత్రి నుంచి మృత దేహాల తరలింపును గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. -
నెత్తురోడిన నల్గొండ రహదారులు
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనల వివరాలు.. మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన బాణావత్ రూప్లా(37), దామరచర్ల మండలం కొండ్రపోలు శివారు మాన్‌తండాకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా అద్దంకి–నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కిష్టాపురం వద్ద నెల్లూరు నుంచి హైదరబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రూప్లా అక్కడికక్కడే మృతిచెందగా, ఐదు కిలోమీటర్ల వరకు బైక్‌ను ఇడ్చుకుపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సైదాబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలానికి వెళ్లి బస్సును స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శాంతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. యాదగిరిగుట్ట (ఆలేరు) : చౌటుప్పల్ మండలం వెలిమినేడుకు చెందిన రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.వరంగల్ నుంచి భువనగిరి వైపు శనివారం వేకువజామున వెళ్తున్న క్రమంలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడా.. లేక మరో లారీ ఎదురుగా ఢీ కొట్టిందా తెలియలేదు. భువనగిరి వైపు వస్తున్న లారీలో ఉన్న రమేష్ అందులో ఇరుక్కుని మృతిచెంది ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. దేవరకొండ : పట్టణానికి చెందిన శివకార్ ఈశ్వర్‌జి(50) తన భార్యతో కలిసి టీవీఎస్ మోటర్‌సైకిల్‌పై ఇంటి నుంచి మార్కండేస్వామి దేవాలయానికి వెళ్తున్న క్రమంలో భార్యను రోడ్డు పక్కన దింపాడు. అనంతరం స్థానిక భారత్ ఫిల్లింగ్ స్టేషన్లోకి పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్తుండగా కొండమల్లేపల్లి వైపు నుంచి దేవరకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈశ్వర్‌జి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. గేదె కళేబరాన్ని ఢీకొని వ్యక్తి.. మేళ్లచెరువు (హుజూర్నగర్) : చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర్లు (24) కొంతకాలంగా మేళ్లచెరువులో ఉంటూ స్థానిక మైహోం సిమెంట్ పరిశ్రమలో రైల్వేట్రాక్ పాయింట్ మన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి తన దగ్గరి బంధువు అంబడిపూడి శ్రీనివాస్‌తో కలిసి కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురి పునరావాసకేంద్రంలో ఓ వివాహానికి హాజరై తిరిగి మేళ్లచెరువు వస్తుండగా కందిబండ సమీపంలోని రోడ్డుమీద పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. ఇదే సమయంలో లారీ వెంకటేశ్వర్లు తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మరో యువకుడికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి కొండలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జయకర్ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని మరొకరు.. నాంపల్లి(మునుగోడు) : మండల పరిధిలోని దామెర గ్రామానికి అబ్బనబోయిన స్వామి (25), తన సోదరుడు అబ్బస్వామితో కలిసి శనివారం మండలంలోని లింగోటం గ్రామంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యాడు. అనంతరం తిరిగి స్వగ్రామం వస్తుండగా వడ్డెపల్లి శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న అబ్బస్వామికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, స్వామికి 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఆ మురిపాలు ఇకలేవు..
► 14 నెలల చిన్నారిని బలిగొన్న ట్రాక్టర్ ► టైరు కిందపడి దుర్మరణం ► మేడ్చల్ మండలం లింగాపూర్‌లో విషాదం మేడ్చల్ : అప్పటివరకు తన అల్లరితో తల్లిదండ్రులను మురిపించిన ఆ చిన్నారి అంతలోనే మృత్యుఒడికి చేరుకుంది. ట్రాక్టర్ చక్రం కిందపడి దుర్మరణం పాలై కన్నవారికి పుట్టెడు దుఃఖం మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మండల పరిధిలో లింగాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సంజీవకు ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్‌ను మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన మహేష్ నడిపిస్తున్నాడు. మహేష్ తన భార్య లక్ష్మి, కూతురు(14నెలలు)తో కలిసి సంజీవ ఇంట్లోనే ఉంటున్నారు. మహేష్ ఆదివారం ఉదయం తన కూతురిని కొద్దిసేపు ఆడించి పనినిమిత్తం ట్రాక్టర్‌తో బయటకు వెళ్లేందుకు పాపను ఇంట్లో తన భార్యకు ఇచ్చాడు. ట్రాక్టర్‌ను స్టార్ట్ చేస్తుండగా పాప బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తండ్రిని చూస్తూ ట్రాక్టర్ వైపునకు వచ్చింది. ఈ విషయం గమనించని మహేష్ ట్రాక్టర్‌ను వెనుకకు పోనిచ్చాడు. టైర్ కొద్దిగా కదిలి ఆగిపోయింది. వాహనం ఎందుకు జరగడం లేదని మహేష్ ట్రాక్టర్ కిందికి దిగి చూడగా చక్రం కింద తన కూతురు పడిఉంది. వెంటనే ట్రాక్టర్‌ను ముందుకు తీసి చిన్నారిని ఓ కారులో నగర శివారులోని బాలాజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే పాప చనిపోయిందని నిర్ధారించారు. అప్పటి వరకు అల్లరి చేసిన చిన్నారి అంతలోనే ప్రమాదం జరిగి కానరాని లోకాలకు వెళ్లడంతో మహేష్, లక్ష్మి దంపతులు గుండెలుబాదుకుంటూ రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా తల్లి.. అంటూ లక్ష్మి రోదించిన తీరు హృద య విదారకం. అనంతరం చిన్నారి మృతదేహాన్ని మహేష్ దంపతులు తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు...కళ్లిపాలెం గ్రామానికి చెందిన దాసరి భిక్షాలు, ఆయన భార్య లక్ష్మీ తిరుపతమ్మ ఆదివారం ఉదయం గుడికి వెళ్లి... తిరిగి కళ్లిపాలెంకు వెళుతుండగా... రేపల్లె రోడ్డులో ప్రజ్నం వద్ద ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ తిరుపతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... భిక్షాలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. (నిజాంపట్నం)