అఫ్గాన్‌లో కూలిన అమెరికా చాపర్‌ | Chopper crash kills 1 American soldier in eastern Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌లో కూలిన అమెరికా చాపర్‌

Published Sat, Oct 28 2017 6:37 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Chopper crash kills 1 American soldier in eastern Afghanistan - Sakshi

వాషింగ్టన్‌(యూఎస్‌ఏ): అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైమానిక హెలికాప్టర్‌ కూలిన ఘటనలో ఒక అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. లోగార్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుందని పెంటగాన్‌ ప్రకటించింది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని తెలిపింది.

అయితే, ఈ ఘటన విద్రోహ చర్య కాదని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని తెలిపింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement