crashe
-
పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి
కాలిఫోర్నియా: ఫాదర్స్ డే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సదరన్ కాలిఫోర్నియా ఎయిర్‌ఫీల్డ్‌కు చెందిన ఎయిర్ మ్యూజియం నిర్వహించిన వేడుకల్లో పాత కాలపు విమానం కుప్పకూలటంతో ఇద్దరు మృతి చెందారు.CALIFORNIAVintage plane crashes after takeoff from Chino Airport; 2 deadJun 16, 2024The Federal Aviation Administration is investigating after a vintage plane crashed shortly after taking off in Chino early Saturday afternoon, killing two people.#Chino #Planecrash #Airport… pic.twitter.com/sg6KSnp4GQ— Abhay (@AstuteGaba) June 16, 2024 ఈ విషయాన్ని ఎయిర్ మ్యూజియం అధికారులు వెల్లడించారు. శాన్ బెర్నార్డినో కౌంటీలోని చినో ఎయిర్ పోర్టుకు పశ్చిమాన శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ట్విన్-ఇంజిన్ లాక్‌హీడ్ 12A విమానం కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.చాలా పురాతనమైన ఈ విమానం యాంక్స్ ఎయిర్ మ్యూజియానికి చెందినదిగా అధికారులు తెలిపారు. యాంక్స్ మ్యూజియం అనేక పురాతన విమానాలకు కలిగి ఉందని తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేపట్టింది. అయితే మృతి చెందిన వారి వివరాలును అధికారులు వెల్లడించింది. -
మహాపతనం : రూ 11 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై : కరోనా వైరస్ విజృంభణతో స్టాక్మార్కెట్లో గురువారం మహాపతనం నమోదైంది. బ్లాక్‌మండే షాక్ నుంచి తేరుకోని మార్కెట్లపై మరోసారి బేర్ పట్టుబిగించింది. అంతర్జాతీయ మహమ్మారిగా కరోనా వైరస్‌ను అధికారికంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లు కకావికలం కావడంతో దేశీ మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. అమెరికా, యూరప్, ఆసియా మార్కెట్ల భారీ పతనం కూడా దేశీ మార్కెట్లను షేక్ చేసింది. మరోవైపు యూరప్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పర్యాటకులపై నిషేధం విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ట్రావెల్ బ్యాన్ కూడా గ్లోబల్ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇక అమ్మకాల వెల్లువతో బీఎస్ఈ సెన్సెక్స్ 2205 పాయింట్ల నష్టంతో 33,492 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 660 పాయింట్ల నష్టంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9802 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడంతో రూ 11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. చదవండి : బ్లాక్ మండే ఎఫెక్ట్ : ఊగిసలాటలో స్టాక్‌మార్కెట్ -
కుప్పకూలిన జాయ్ రైడ్ : ఇద్దరు మృతి
గుజరాత్‌లోని అడ్వెంచర్ పార్క్‌లో ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. జాయ్‌రైడ్ (కొలంబస్ లాంటిది) అకస్మాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ మణినగర్‌లోని అడ్వెంచర్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సెలవు రోజు సరదాగా అలా పార్క్ వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అనూహ్యంగా ఇక తిరిగి రాని లోకాలకు తరలి పోయారు. మరో 29 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన వారిని మణినగర్‌లోని ఎల్జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని నగర మేయర్ బిజాల్ పటేల్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా తెలిపారు. ప్రధాన షాఫ్ట్ పైపు విరిగి నేలమీద కుప్పకూలిందని, దీనిపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) దర్యాప్తు చేస్తోందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ దస్తూర్ వెల్లడించారు. -
నాసిక్ వద్ద కుప్పకూలిన సుఖోయ్ యుద్ధవిమానం
-
అఫ్గాన్‌లో కూలిన అమెరికా చాపర్
వాషింగ్టన్(యూఎస్ఏ): అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైమానిక హెలికాప్టర్ కూలిన ఘటనలో ఒక అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. లోగార్ ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుందని పెంటగాన్ ప్రకటించింది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని తెలిపింది. అయితే, ఈ ఘటన విద్రోహ చర్య కాదని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని తెలిపింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. -
చంద్రుడి కో ఉల్కా దెబ్బ!
మన చందమామకు భారీ ఉల్కా దెబ్బ తగిలింది. కారు సైజు ఉన్న ఓ ఉల్క గంటకు 61 వేల కి.మీ. వేగంతో దూసుకొచ్చి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో 8 సెకన్లపాటు భూమిపై నుంచి సైతం చిన్న చుక్కలా కనిపించేలా అత్యంత ప్రకాశం వెలువడింది. గతేడాది సెప్టెంబరు 11న జరిగిన ఈ పేలుడును స్పానిష్ ఖగోళ శాస్త్రవేత్త జోషే మారియో మాడీడో అప్పుడే వీడియో తీసినా.. అసలు విషయం నిర్ధారించుకునేందుకు, అంచనా వేసేందుకు ఇంత సమయం పట్టిందట. చంద్రుడిపై శాస్త్రవేత్తలు రికార్డు చేసిన ఉల్కాపాతాల్లోనే అతి భారీదైన ఈ పేలుడు వల్ల 15 టన్నుల టీఎన్టీ పేలుడుకు సమానమైన శక్తి వెలువడి ఉండవచ్చని, సుమారు 40 మీటర్ల గొయ్యి ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. చిత్రంలో చంద్రుడిపై ఉల్క పడిన ప్రదేశాన్ని, వెలుతురును(బాణం గుర్తు వద్ద) చూడొచ్చు.