మహాపతనం : రూ 11 లక్షల కోట్ల సంపద ఆవిరి | Indian Equity Markets Went On A Freefall | Sakshi
Sakshi News home page

మహాపతనం : రూ 11 లక్షల కోట్ల సంపద ఆవిరి

Mar 12 2020 12:42 PM | Updated on Mar 12 2020 8:32 PM

Indian Equity Markets Went On A Freefall - Sakshi

ముంబై : కరోనా వైరస్‌ విజృంభణతో స్టాక్‌మార్కెట్లో గురువారం మహాపతనం నమోదైంది. బ్లాక్‌మండే షాక్‌ నుంచి తేరుకోని మార్కెట్లపై మరోసారి బేర్‌ పట్టుబిగించింది. అంతర్జాతీయ మహమ్మారిగా కరోనా వైరస్‌ను అధికారికంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లు కకావికలం కావడంతో దేశీ మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. అమెరికా, యూరప్‌, ఆసియా మార్కెట్ల భారీ పతనం కూడా దేశీ మార్కెట్లను షేక్‌ చేసింది.

మరోవైపు యూరప్‌ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పర్యాటకులపై నిషేధం విధిస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ట్రావెల్‌ బ్యాన్‌ కూడా గ్లోబల్‌ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇక​ అమ్మకాల వెల్లువతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2205 పాయింట్ల నష్టంతో 33,492 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 660 పాయింట్ల నష్టంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9802 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడంతో రూ 11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

చదవం‍డి : బ్లాక్‌ మండే ఎఫెక్ట్‌ : ఊగిసలాటలో స్టాక్‌మార్కెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement