ఓ అధికారి హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకునే యత్నంలో టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ బయట సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వాధికారి మృత్యువాత పడ్డారు. బాధితుడిని జితేంద్ర కుమార్ సైనీగా గుర్తించారు అధికారులు. అతడు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదం కేదార్‌నాథ్ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద జరిగింది. సైనీ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నసమయంలో అనుకోకుండా హెలికాప్టర్ టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. దీంతో సైనీ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అక్షయ తృతియ సందర్భంగా భక్తుల చార్‌ధామ్ యాత్ర కోసం అని గంగోత్రి, యమునోత్రి పోర్టల్‌లను ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఈ అనూహ్య సంఘటన జరిగింది. కాగా తీర్థ యాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. ఐతే కేదార్‌నాథ్ దేవాలయాన్ని ఏప్రిల్ 25న బద్రీనాథ్‌ను ఏప్రిల్ 27న తెరవనున్నారు.
(చదవండి: చార్‌ధామ్ యాత్ర ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment