ఇంటి వద్ద ఏర్పాటుచేసిన వర్క్‌షాపులో తయారుచేసిన చాపర్ బైకుపై కూర్చుని ఫొటోలకు పోజిస్తున్న జాకీర్
యశవంతపుర: రద్దీ రోడ్లపై 13 అడుగుల బైకు నడపడం సాధ్యమా? అంత కష్టమేం కాదంటున్నాడు జాకీర్. బెంగళూరులోని నాగరబావికి చెందిన జాకీర్(29) ఇంటీరియర్ డిజైనర్. కొత్తగా ఏదైనా చేసేందుకు వాహనరంగాన్ని ఎంచుకున్నాడు. ఇంటి వద్దనే వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకుని వేర్వేరు సంస్థల బైక్ విడిభాగాలు సమకూర్చుకున్నాడు. సుమారు నెలన్నరపాటు శ్రమించి రూ.7.5లక్షలు ఖర్చు చేసి 220 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌తో 450 కిలోల బరువు, 13 అడుగుల పొడవు, 5.5 అడుగుల వెడల్పుతో ఉన్న చాపర్ బైక్ తయారుచేశాడు.
ఒక్కరు మాత్రమే కూర్చునేందుకు వీలుండే ఈ బైక్‌పై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. అన్ని ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ వెనుక వైపు ఉండగా దీనికి మాత్రం ముందు భాగంలో ఏర్పాటు చేశాడు. ముందు చక్రం చిన్నదిగా, వెనుక చక్రం పెద్దదిగా ఉంది. వెనుక చక్రం మినీ ట్రక్ టైర్‌లా ఉంటుంది. ఈ చాపర్ బైకును శని, ఆదివారాల్లో జేపీ నగరలోని శ్రీ దుర్గా పరమేశ్వరి బీడీఏ మైదానంలో అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నాడు. ప్రపంచంలోనే అతి పొడవైన బైక్‌గా ఇది రికార్డు సృష్టించనుందని జాకీర్ ధీమావ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment