ఏటీసీ చేతికి వయోమ్ | Srei Infra completes Viom stake sale | Sakshi
Sakshi News home page

ఏటీసీ చేతికి వయోమ్

Published Fri, Apr 22 2016 1:42 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM

ఏటీసీ చేతికి వయోమ్ - Sakshi

ఏటీసీ చేతికి వయోమ్

కొనుగోలు ప్రక్రియ పూర్తి  డీల్ విలువ రూ. 7,635
ముంబై:  నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు రావడంతో టెలికం టవర్ల నిర్వహణ సంస్థ వయోమ్ నెట్‌వర్క్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఏటీసీ) గురువారం వెల్లడించింది. దాదాపు రూ. 7,635 కోట్లకు వ్యోమ్‌లో 51 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు గతేడాది అక్టోబర్ 21న ఏటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వ్యోమ్ విలువ సుమారు రూ. 22,000 కోట్లు. ఏటీసీకి ప్రపంచవ్యాప్తంగా 1,42,000 పైచిలుకు టెలికం టవర్లు ఉన్నాయి.

వ్యోమ్‌కు 2011-12 నాటికి 40,000 పైచిలుకు టవర్లు ఉన్నాయి.  50 టవర్లతో 2005లో క్విపో టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా మొదలైన సంస్థ, టాటా టెలీసర్వీసెస్‌లో విలీనంతో వయోమ్‌గా రూపాంతరం చెందింది. దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర టెలికం టవర్ కంపెనీగా ఎదిగింది. వయోమ్ డీల్‌తో ఏటీసీకి భారత్‌లో మొత్తం 57,000 పైగా టవర్లు ఉంటాయి. కోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్‌తో పాటు ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ తదితర ఇన్వెస్టర్ల నుంచి వాటాల కొనుగోలు ద్వారా వయోమ్‌ను ఏటీసీ దక్కించుకుంది. వయోమ్‌కు రూ. 5,100 కోట్ల రుణ భారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement