
ఎల్లుండి అచ్యుతాపురం సెజ్‌కు వెళ్లనున్న వైఎస్ జగన్
ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
సాక్షి, గుంటూరు: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(శుక్రవారం) పరిశీలించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్.. వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment