సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. మధ్యాహ్నం రియాక్టర్ పేలే సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక గాయపడిన క్షతగాత్రుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు గాయపడ్డ క్షతగాత్రుల సంఖ్య 50 దాటింది. మరణించిన వారిలో చల్లపల్లి హారిక (24), పూడి మోహన్ (23), దుర్గా ప్రసాద్, చిన్నారావులు,రాజశేఖర్ ఉన్నారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుల వివరాలు
1. వి. సన్యాసినాయుడు (50), ప్లాంట్ ఏజీఎం
2. రామిరెడ్డి, ల్యాబ్ హెడ్
3. హారిక కెమిస్ట్
4. పార్థసారథి(23), ప్రొడక్షన్ ఆపరేటర్
5. వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్
6.పి.రాజశేఖర్ (22)
7. మోహన్, ఆపరేటర్
8. గణేష్, ఆపరేటర్
9. హెచ్. ప్రశాంత్
10. ఎం. నారాయణరావు.. మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉంది.
క్షతగాత్రులకు అందని మెరుగైన వైద్యం
👉 ఎసెన్షియా కంపెనీ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు అందని మెరుగైన వైద్యం
👉 అత్యవసర మెరుగైన వైద్యం అందించకపోతే క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం
👉 వైద్యం అందడం లేదని అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్న క్షతగాత్రులు
👉 అటు ఇటు తిరుగుతూ అధికారులు హడావిడి చేస్తున్నారే తప్ప మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవడం లేదని బాధితుల ఆగ్రహం
చేతులెత్తేసిన ఫైర్ ఫైటర్స్
👉 పెరిగి పోతున్న మృతుల సంఖ్య
👉మృతదేహాల వెలికితీత లో చేతులెత్తిశిన ఫైర్ ఫైటర్స్
👉 కైలసపురం నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
👉 గ్యాస్ కట్టర్‌లతో శిధిలాలను తొలగిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
👉శిధిలాల కింద పదుల సంఖ్యలో మృతదేహాలు
అధికారులు పట్టించుకోవడం లేదు
👉ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు రాలేదు
👉కంపెనీ బస్సులోనే గాయాలతో మేమంతా ఆసుపత్రికి వచ్చాం
👉ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించడం లేదు
👉నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది అయినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు
👉అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు
👉క్షతగాత్రులు అందరినీ మెరుగైన చికిత్స కోసం వైజాగ్ తరలించవచ్చు కానీ ఆ ప్రక్రియ ఇక్కడ జరగడం లేదు..- నాయుడు, క్షతగాత్రుడు
ఏడు అంతస్తుల ఎసెన్షియా కంపెనీలో మూడోఫ్లోర్‌లో 500 కిలో లీటర్ రియాక్టర్ పేలినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు దాటికి మూడోఫ్లోర్ గోడలు ధ్వంసం అయ్యాయి. దీంతో స్లాబు కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. శిధిలాల కింద చిక్కుకున్న కార్మికుల్ని రక్షించేందుకు పొక్లెయిన్ సహాయంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు.
300 మంది కార్మికులు పనిచేస్తున్న ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనకాపల్లి ఉష ప్రైమ్ ఆసుపత్రికి తరలించి, వారికి చికిత్సను అందిస్తున్నారు. వారిలో చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక ఘటనా స్థలానికి చేరుకుంది. 15 ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలు పెట్టారు.
మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment